కంబోడియాలో ‘కేజీఎఫ్‌’ తరహా సైబర్ నేరాలు

posted on: Feb 11, 2026 7:44PM

 

కంబోడియాలో ‘కేజీఎఫ్‌’ సినిమా తరహాలో నడుస్తున్న భారీ సైబర్ నేరాల సామ్రాజ్యం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాల పేరుతో విదేశాల నుంచి యువతను రప్పించి, వారిని భవన సముదాయా ల్లో బంధించి బలవంతంగా సైబర్ నేరాలకు పాల్పడేలా చేస్తున్న మాఫియా గుట్టును కంబోడియా ప్రభుత్వం ఛేదించింది. దేశవ్యాప్తంగా చేపట్టిన భారీ ఆపరేషన్‌లో 200 మంది సైబర్ గ్యాంగ్‌స్టర్లను అరెస్ట్ చేసి నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.ఈ దాడుల్లో 16 దేశాలకు చెందిన సుమారు 11 వేల మంది విదేశీయులను భద్రతా బలగాలు గుర్తించి రక్షించి నట్లు సమాచారం. వీరిలో పెద్ద సంఖ్యలో ఆసియా దేశాల పౌరులు ఉన్నట్లు తెలుస్తోంది. 

బాధితులను ఆకర్షణీయమైన జీతాలు, కార్పొరేట్ ఉద్యోగాల హామీలతో కంబోడియాకు రప్పించి, అక్కడికి చేరుకున్న వెంటనే వారి పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకుని బందీలుగా ఉంచినట్లు దర్యాప్తులో బయటపడింది. అయితే ఈ సైబర్  ముఠాలు ప్రత్యేకంగా నిర్మించిన భవన సముదాయాల్లో బాధితు లను నిర్బంధించి, రోజుకు 12 నుంచి 16 గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చో బెట్టి ఆన్‌లైన్ మోసాలకు పాల్పడేలా ఒత్తిడి తెచ్చి నట్లు అధికారులు తెలి పారు. ఆదేశాలు పాటించ కపోతే శారీరక, మానసిక హింసకు గురిచేసిన ఘట నలు కూడా వెలుగులోకి వచ్చాయి.

దర్యాప్తులో 172 మంది కలిసి వ్యవస్థబద్ధంగా ఈ సైబర్ నేరాలను నడిపిస్తున్నట్లు గుర్తించారు. ఈ మాఫియా నెట్‌వర్క్ అంతర్జాతీయ స్థాయిలో విస్తరించి ఉండటం గమనార్హం....ప్రత్యేకంగా భారతీయులను లక్ష్యంగా చేసుకుని నకిలీ పోలీస్‌స్టేషన్లు, సీబీఐ, ఈడీ కార్యాలయాల సెట్టింగ్‌లు ఏర్పాటు చేసి వీడియో కాల్‌ల ద్వారా ‘డిజిటల్ అరెస్ట్’ పేరిట బెదిరింపులకు పాల్పడినట్లు వెల్లడైంది. బ్యాంక్ ఖాతాల్లో అక్రమ లావాదేవీలు జరిగాయని, కేసులు నమోదయ్యాయని భయపెట్టి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. వేల సంఖ్యలో నకిలీ పోలీస్ స్టేషన్ సెట్టింగ్‌లు, అధికారిక లోగోలు, ఫేక్ ఐడీలు ఉపయోగించి బాధితులను నమ్మించే ప్రయత్నం చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

కేజీఎఫ్‌ తరహాలో సామ్రాజ్యం

భారీ భవన సముదా యాలు, కఠిన భద్రతా ఏర్పాట్లు, అంతర్గత నియంత్రణ వ్యవస్థలతో ఈ మాఫియా ప్రత్యేక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. బయటకు కార్పొరేట్ కార్యాలయాల్లా కనిపించిన ఈ కేంద్రాలు లోపలికి వెళ్తే పూర్తిగా సైబర్ నేరాల గూటిలా మారిపో యినట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి.ఈ ఆపరే షన్‌పై కంబోడియా ప్రభుత్వం అధికారిక నివేదిక విడుదల చేసింది. అంతర్జాతీయ సహకారంతో మరిన్ని దాడులు కొనసాగుతున్నాయని తెలిపింది. బాధితులను వారి దేశాలకు సురక్షితంగా పంపించేందుకు చర్యలు ప్రారంభించామని పేర్కొంది. 

ఈ ముఠాకు ఆర్థిక సహాయం అందించిన వ్యక్తులు, సంస్థలపై కూడా విచారణ కొనసాగుతోందనివెల్లడించింది. అంతర్జాతీయ సైబర్ నేరాలపై ఇది పెద్ద దెబ్బగా భావిస్తున్న నిపుణులు, యువత విదేశీ ఉద్యోగాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఆకర్షణీయమైన జీతాల పేరుతో వచ్చే ఆఫర్లను పూర్తిగా పరిశీలించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. కంబోడియాలో బయటపడిన ఈ సైబర్ నేరాల సామ్రాజ్యం, గ్లోబల్ స్థాయిలో పెరుగుతున్న డిజిటల్ మోసాల తీవ్రతకు స్పష్టమైన ఉదాహరణగా నిలిచింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...