చర్చలకు ఓకే.. కానీ.. ఇరాన్ అధ్యక్షుడి సంచలనం.!

posted on: Aug 8, 2026 10:19AM

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలకు ఇప్పట్లో తెరపడే అవకాశాలు కనిపిండం లేదు. అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై దాడులకు విరామం ఇచ్చి చర్చలకు మార్గం సుగమం చేసినా.. దిగి రావడానికి ఇరాన్ ససేమిరా అంటోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెచ్చరిల్లుతున్నాయి. తాజాగా ఇరాన్ నూతన అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్  టెహ్రాన్‌లో నిర్వహించిన ఒక  కార్యక్రమంలో   పాశ్చాత్య దేశాలు విధిస్తున్న ఆర్థిక, దౌత్యపరమైన ఆంక్షలపై విమర్శలు గుప్పించారు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఒత్తిళ్లకు తాము భయపడేది లేదని, శాంతియుత వాతావరణంలో సంప్రదింపులకు సదా సిద్ధంగానే ఉన్నా..  బెదిరింపులకు భయపడి లొంగే ప్రశక్తే లేదని కుండబద్దలు కొట్టారు. 

అమెరికా,  యూరోపియన్ యూనియన్   గత కొన్నేళ్లుగా ఇరాన్ అణు కార్యక్రమాన్ని నెపంగా చూపుతూ ఆ దేశంపై  ఆర్థిక ఆంక్షలను విధించిన సంగతి వదితమే. ఈ రకమైన ఏకపక్ష ఆంక్షలతో ఇరాన్‌ను లొంగదీసుకోవచ్చని వారు భావిస్తే..    అది వారి భ్రమమాత్రమేనని పెజెష్కియాన్ అన్నారు.  ప్రపంచంలోని ఏ దేశంతోనూ ఇరాన్ శత్రుత్వాన్నీ, యుద్ధాన్నీ కోరుకోవడం లేదని స్పష్టం చేసిన ఆయన.. వివాదాలను   సంప్రదింపులు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.

అయితే..  చర్చల పేరుతో తమ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేలా ఏకపక్ష నిబంధనలు, షరతులు రుద్దాలని చూస్తే సహించబోమని స్పష్టం చేశారు. తమ దేశ ప్రయోజనాలు, భద్రత విషయంలో రాజీపడే ప్రశ్నేలేదనీ,  పరస్పర గౌరవం, సమానత్వ ప్రాతిపదికన మాత్రమే ఏ దేశంతోనైనా చర్యలు జరుగుతాయని, అలాగే ఇరాన్ పై  ఆంక్షల ఉపశమనం  జరగాలని పెజెష్కియాన్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.  

Masoud Pezeshkian, Iran sanctions news, Iran US tensions, Tehrans nuclear issue, Iran President warning, China Russia Iran relations

google-ad-img
    Related Sigment News
    • Loading...