చరిత్ర పుస్తకాల్లోకి... ముఖపుస్తకం సీఈవో!

posted on: Sep 22, 2016 2:55PM

చేతిలో కత్తుంటే వీరుడైపోడు. ఆ కత్తి ఎలా వాడాలో, ఎవరి మీద వాడాలో తెలిస్తేనే వీరుడనిపించుకుంటాడు! ధనవంతుడు కూడా అంతే... ఊరికే కోట్లు సంపాదిస్తే గొప్పోడు అయిపోడు! నిజమైన గొప్ప వాడు అయ్యేది... తన వద్ద వున్న డబ్బును ఎలా ఖర్చు చేయాలో తెలిస్తేనే!. ఫేస్బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్ తాను డబ్బులున్న వీరుడినని నిరూపించుకున్నాడు!

 

మన దేశంలోని వేల కోట్లున్న సంపన్నుల్లా కాక దేవుడిచ్చిన సంపదని ఎలా వాడాలో ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు. ఇంతకీ ఆయన తన భార్య ప్రిసిల్లా చాన్ తో కలిసి చేసిన సత్కార్యం ఏంటో తెలుసా? ఓ మూడు బిలియన్ డాలర్లు చిన్న పిల్లల అనారోగ్యలపై పరిశోధనలకి కేటాయించాడు! ఓస్ .. ఇందులో ఏముంది అంటారా? ఇలా సమాజ సేవ చేయటం చాలా మంది డబ్బున్నోళ్లు చేస్తూనే వుంటారు కదా అంటారా? అది కరెక్టే! కాని, ఇంతకు ముందే జూకర్ బెర్గ్ తన సంపదలో 99శాతం సమాజ సేవకే వెచ్చిస్తానని ప్రకటించాడు. అందులో భాగంగా ఇప్పుడు మూడు బిలియన్లు... అంటే, మన దేశ కరెన్సీగా  అయితే... 20వేల కోట్లు చిన్న పిల్లల ఆరోగ్యానికి ఖర్చు చేస్తున్నాడు!


జూకర్ బెర్గ్ భార్య మాటల్లో చెప్పుకుంటే ఈ శతాబ్దం చివరికల్లా చిన్న పిల్లల్లో అనారోగ్యాలు వుండకూడదు. అదీ ఈ ఫేస్బుక్ దంపతుల ఆశయం! నిజంగా ఇలాంటి ఆలోచనతో పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయటం అందరం మెచ్చుకోవాల్సిన విషయం! అంతే కాదు లక్షల కోట్లు నిస్సిగ్గుగా మెక్కి కూర్చునే మన పొలిటీషన్స్, కార్పోరేట్స్ కూడా ఎంతో నేర్చుకోవాలి. కార్లలో తిరిగి , బంగలాల్లో బజ్జోకుండా తమకు ఎంతో ఇచ్చిన సమాజానికి తిరిగి ఎంతో కొంత చేయాలి. ఆఫ్ట్రాల్... టైమొస్తే ఎంత డబ్బున్న వాడైనా కఠిక దరిద్రుడిలాగే చచ్చి స్మశానానికి పోతాడు కదా! రూపాయి కూడా వెంట తీసుకుపోడు! ఇదే జూకర్ బెర్గ్ ఉదారత్వం నిరూపించే సత్యం... 

google-ad-img
    Related Sigment News
    • Loading...