Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పాపం షరపోవా!
posted on: Mar 8, 2016 9:31AM
.jpg)
షారపోవా పేరు వింటే చాలు టెన్నిస్ గుర్తుకువస్తుంది. 17 ఏళ్ల చిన్న వయసులోనే వింబుల్డన్‌ను కైవలం చేసుకున్నా, గాయాలతో బాధపడుతూ కూడా విజయాలు సాధిస్తున్నా, అత్యధిక సంపాదన కలిగిఉన్న క్రీడాకారిణిగా నిలిచినా... ఈ రష్యన్ తారది టెన్నిస్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన అధ్యాయం. అలాంటి షరపోవాని ఇప్పుడు టెన్నిస్‌నుంచే బహిష్కరించే పరిస్థితి వచ్చింది. మెల్‌డోనియం అనే ఒక ఉత్ప్రేరకాన్ని తీసకుంటోందని ఆమె రక్త పరీక్షలలో తేలడంతో అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ఆమెను బహిష్కరించేందుకు సిద్ధంగా ఉంది. ఈ బహిష్కరణ నాలుగేళ్ల పాటు ఉండవచ్చని తెలుస్తోంది. అయితే కొన్ని అరుదైన సందర్భాలలో సమాఖ్య తక్కువకాలం బహిష్కారంతో శిక్షని సరిపెట్టవచ్చు. కానీ అది ఎంత తక్కువకాలమైనప్పటికీ, సాధారణంగా ఒకసారి బహిష్కరణకు గురైన ఆటగాడు తిరిగి ఫాంలోకి రావడం అరుదుగా జరుగుతంది. ఒకోసారి ఈ బహిష్కరణ ఆటగాడి కెరీర్‌కు ముంగింపు పలికిన సందర్భాలు కూడా లేకపోలేదు. 2007లో ఇలా బహిష్కరణకు గురైన స్విస్ టెన్నిస్ క్రీడాకారిణి మార్టిన్ హింగిస్ తిరిగి టెన్నిస్ ఆడలేక రిటైర్మెంట్ తీసుకున్న విషయం ఈ సందర్భంగా గుర్తుకురాక మానదు.
తాను ఉత్ప్రేరకాన్ని తీసుకోవడానికి సంబంధించి షరపోవా వాదన వేరేలా ఉంది. గత పది సంవత్సరాలుగా తాను ఈ మందుని తీసుకుంటున్నాననీ, డయాబెటిస్ రాకుండాఈ మందుని వాడుతున్నాననీ చెబుతోంది. కానీ మెల్‌డోనియంకి సంబంధించి నిపుణుల మాట వేరేలా ఉంది. ఆటగాళ్లు తమలో చురుకుదనం పెరిగేందుకు ఈ మందుని వాడతారనీ, దీన్ని చాలా దేశాల్లో నిషేధించారనీ చెబుతున్నారు. వీరిలో ఎవరి వాదన నిజమైనా షరపోవా కొన్నాళ్లపాటు నిషేధానికి గురికావడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఇంతటితో షరపోవా ఆట ముగిసినట్లేనా!



.jpg)


