ఏపీ మంత్రులకు మావోల బెదరింపులు
posted on: Feb 11, 2026 12:55PM
.webp)
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లోని నలుగురు మంత్రులకు మావోయిస్టుల నుంచి బెదరింపు లేఖలు వచ్చాయి. మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ లకు మావోయిస్టుల నుంచి బెదరింపు లేఖలు వచ్చాయనీ, అంతే కాకుండా ఫోన్ లలో కూడా మావోలు వీరిని బెదరించారనీ తెలుస్తోంది.
వీరిలో మంత్రి కందుల దుర్గేష్ అయితే మావోయిస్టుల నుంచి బెదరింపులు వచ్చిన సంగతిని ధృవీకరించారు. అయితే తామెవరమూ ఈ బెదరింపులు మావోల నుంచి వచ్చినట్లు విశ్వసించడం లేదని చెప్పారు. బెదరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పిన మంత్రి కందుల దుర్గేష్.. ఇవి మావోల బెదరింపులు అయ్యి ఉండవన్న విషయాన్ని కూడా పోలీసులకు తెలిపినట్లు చెప్పారు. మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడిన కందుల దుర్గేష్ మావోయిస్టుల లేఖలు ఇలా ఉండవన్నారు. విషయాన్ని తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశామని, విషయం వాళ్లే తేలుస్తారనీ అన్నారు.


.webp)
.webp)


