సీఎంకు ప్రాణగండమా? అందుకే, సెక్యురిటీ పెంచేశారా?

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్రాణ గండం పొంచి వుందా? పరిస్థితులు చూస్తుంటే అలానే వుంది. అయితే, సీఎం భద్రతకు ముప్పు తీసుకొస్తోంది ఆయన వ్యక్తిగత ఆరోగ్య కారణాలు కావు. అంతకన్నా ప్రమాదకరమైన మావోయిస్టు కోణం నుంచి గండం వాటిల్లనుందంటున్నారు. అంతే కాదు, భారీగా భద్రత కూడా పెంపు చేశారు. ఇప్పటికే మావోయిస్టు ప్రభావం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి జెడ్ ప్లస్ క్యాటగిరి రక్షణ కట్టుదిట్టంగా వుంటుంది. కాని, ఈ మధ్య నక్సల్స్ కదలికలు అనుమానాస్పదంగా , ఆందోళనకరంగా మారటంతో కేసీఆర్ సెక్యురిటీ మరింత పెంచారు. 

 


అటు ఆంధ్రప్రదేశ్ లోఒడిశా బార్డర్ లో మావోల కలకలం ఈ మధ్య చాలా ఎక్కువైంది. అలాగే తెలంగాణలో కూడా ఉత్తర ప్రాంత జిల్లాల్లో వామపక్ష తీవ్రవాదులు బలంగా సంచరిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే, ఆల్రెడీ ఆరు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలున్న సీఎం కాన్వాయ్ లో మరో మూడు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ యాడ్ చేశారు. ఒక అంబులెన్స్ కూడా వెంట వుంటుంది. ఇక ఇప్పటి దాకా సీఎం చుట్టూ వుండే జెడ్ ప్లస్ సెక్యురిటీలో ఇద్దరు డీఎస్పీలు వుండేవారు. కాని, వారికి తోడుగా మరో ఆరుగురు ఇన్ స్పెక్టర్లని నియమించారు. 36మంది కేంద్ర ఎన్ఎస్జీ భద్రతా సిబ్బందితో పాటూ రాష్ట్ర సెక్యురిటీ ఫోర్స్ నుంచి పన్నెండు మంది వుండేవారు. ఈ సంఖ్యని పదహారుకి పెంచారు. 

 


సీఎం ఎక్కువగా గడిపే క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్ వద్ద మొత్తం పది సెక్యురిటీ పోస్ట్ లు ఏర్పాటు చేశారు. ఎర్రవల్లిలోని ఆయన ఫామ్ హౌజ్ వద్ద రెండు నుంచి ఆరు సెక్యురిటీ పోస్ట్ లకు భద్రతను పెంచారు. అంతే కాదు, కేసీఆర్ గతంలో మాదిరిగా ఎప్పుడంటే అప్పుడు ఫామ్ హౌజ్ కి వెళ్లకపోవటం మంచిదని అధికారులు చెప్పారంటున్నారు. ముందస్తు సమాచారం ఇచ్చాకే బయలుదేరాలని వారు కోరారట. 

 


ఈ హఠాత్ భద్రతా చర్యల్ని చూస్తుంటే ఇంటలిజెన్స్ వర్గాలకి మావోల కదలికలపై గట్టి సంకేతాలే అందినట్టు అనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో జరిగిన ఎన్ కౌంటర్లకి నక్సల్స్ లోలోన రగిలిపోతున్నారు... 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu