బీఆర్ఎస్ కార్యాలయానికి నిప్పు
posted on Nov 2, 2025 11:15AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు బీఆర్ఎస్ కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఆఫీస్‌లో ఫర్నీచర్ బయటపడేసి పెట్రోలు పోసి నిప్పంటించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించి బీఆర్ఎస్ కార్యాలయంగా.. చేసుకున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు మణుగూరు తమ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాడుల విష సంస్కృతిని ప్రోత్సహిస్తుందని బీఆర్‌ఎస్ నేతలు తెలిపారు. కాంగ్రెస్ నేతలు నిప్పు పెట్టడంతో చుట్టుపక్కల ఇండ్లలో షార్ట్ సర్య్కూట్ అయ్యి గృహోపకరణాలకు నష్టం వాటిల్లింది. దీంతో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొన్నది.