Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తప్పుడు వ్యక్తిని గెలిపించా క్షమించండి.. రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!
posted on: Jul 24, 2026 9:22PM
.webp)
మందుల సామేల్ వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి స్పందన..!
ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. తుంగతుర్తి శాసనసభ్యుడు మందుల సామేల్ చేసిన వ్యాఖ్యలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ శ్రేణులకు ఆయన బహిరంగంగా క్షమాపణలు తెలియజేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
భువనగిరి కలెక్టరేట్ వేదికగా మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే సామేల్ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత శాసనసభ ఎన్నికల్లో పార్టీ అధిష్ఠానంతో మాట్లాడి, తాను ప్రత్యేకంగా కోరిన రెండు సీట్లలో తుంగతుర్తి ఒకటని, సామేల్‌కు టికెట్ ఇప్పించి విజయం కోసం శ్రమించానని గుర్తుచేశారు.
తనను, తన నాయకత్వాన్ని నమ్మి సామేల్‌ను గెలిపించినందుకు తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తనను క్షమించాలని రాజగోపాల్ రెడ్డి కోరారు. తన మద్దతుతో గెలిచిన వ్యక్తినేడు తనపైనే అనుచిత వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందంటూ, ఆ విమర్శలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు.
సొంత పార్టీలో నిజమైన, నిబద్ధత కలిగిన కార్యకర్తలను కాపాడుకోవడమే తన ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడిన శ్రేణుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తాను ఎలాంటి త్యాగానికైనా వెనుకాడనని తేల్చిచెప్పారు.
ఇటీవల పార్టీలోకి వచ్చి చేరుతున్న కొత్త నాయకులు పాత కార్యకర్తలను విస్మరించడమే కాకుండా, వారిని ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సామేల్ వైపు నుంచి ఎలాంటి విమర్శలు, ఆరోపణలు వచ్చినా కోమటిరెడ్డి అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు శాంతితో, సహనంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు.
పార్టీలోని పాత, కొత్త నాయకుల మధ్య నెలకొన్న ఈ అసంతృప్తులపై కాంగ్రెస్ అధిష్ఠానం తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. నిజమైన కార్యకర్తలకు న్యాయం జరిగేలా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
తాజా పరిణామాలతో తుంగతుర్తి నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ అధిష్ఠానం వేగంగా స్పందించి ఈ విభేదాలకు ముగింపు పలుకుతుందో, లేక ఈ మాటల యుద్ధం మున్ముందు మరిన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.
Mandula Samuel, Komatireddy Rajagopal Reddy, Telangana Congress News, Tungathurthi MLA, Nalgonda Politics, Tungaturthi Congress Politics


.webp)



