Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పోచారంలో రాంబాయి సీన్.. పెళ్లికి నిరాకరించిన యువతికి ఎయిడ్స్ రక్తం ఎక్కించిన యువకుడు
posted on: Mar 14, 2026 2:20PM

హైదరాబాద్ పోచారం ఐటీ కారిడార్ పరిధిలో 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమా తరహాలో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లికి నిరాకరించిందని కోపంతో ఓ యువకుడు యువతికి ఎయిడ్స్ వ్యాధి ఉన్న రక్తాన్ని ఎక్కించే ప్రయత్నం చేశాడు. ఈ దారుణమైన ఘటనలో నిందితుడితో పాటు అతడి తల్లిదండ్రులకు కూడా గతంలోనే ఎయిడ్స్ సోకినట్లు అధికారులు గుర్తించారు.
పోచారంలో జరిగిన ఈ షాకింగ్ సంఘటన సంచలనం రేపింది. పెళ్లి నిరాకరించిందన్న కారణంతో పోచారం ప్రాంతా నికి చెందిన యువకుడు మనోహర్ ఓ యువతికి ఎయిడ్స్ సోకిన రక్తాన్ని ఎక్కించాడు. మనోహర్ కు పోచారం ప్రాంతానికే చెందిన యువతితో కొంతకాలంగా పరిచయం ఉంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. వారి వివాహానికి కుటుంబ సభ్యులు కూడా ఆమోదం తెలపడంతో ఇద్దరికీ వివాహం చేయడానికి పెద్దలు నిర్ణయించారు. అయితే ఈ తరువాత మనోహర్‌కు అతని తల్లిదండ్రులకు ఎయిడ్స్ ఉందని తెలిసింది. దీంతో యువతి కుటుంబం ఆ వివాహాన్ని రద్దు చేసుకుంది. దీనితో మనోహర్ కక్ష పెంచుకున్నాడు.
చివరి ప్రయత్నం అన్నట్లుగా ఈ నెల 11న మనోహర్ ఆ యువతి ఇంటి కి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. అయితే యువతి స్పష్టంగా నిరాకరించడంతో మనోహర్ తన వెంట తెచ్చుకున్న ఎయిడ్స్ సోకిన రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా యువతికి ఎక్కించాడు. రెప్పపాటు వ్యవధిలో జరిగిన ఈ దారుణంతో యువతి కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. వెంటనే యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోచారం పోలీసులు నిందితుడు మనోహర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.



.webp)


