Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బెంగాల్ రాజకీయాల్లో పట్టు చాటిన మమతా బెనర్జీ.!
posted on: Aug 20, 2026 12:16PM

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాభవం ఇసుమంతైనా తగ్గలేదనీ, ఎన్నికలలో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆమె ప్రజాదరణ చెక్కు చెదరకుండా నిలిచే ఉందనీ తేలింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ పరాజయం పాలైంది. ఆ ఎన్నికలలో మమతా బెనర్జీ స్వయంగా పరాజయం పాలయ్యారు. అయినా పొలిటికల్ గా ఆమె బలం, పట్టు అలాగే ఉన్నాయి.
తాజాగా పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘనవిజయాన్ని సాధించడమే ఇందుకు నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తు మరియు టీఎంసీ బలంపై అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో.. తాజాగా జరిగిన బార్ కౌన్సిల్ ఎన్నికల టీఎంసీ విజయం మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ శ్రేణుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపిందనడంలో సందేహం లేదు.
బార్ కౌన్సిల్ ఎన్నికల మొత్తం 23 స్థానాలకు గానూ తృణమూల్ కాంగ్రెస్ 15 స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన ఆధిక్యాన్ని చాటింది. ఈ ఎన్నికల్లో బీజేపీ కేవలం మూడంటే మూడు స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. లెఫ్ట్ ఫ్రంట్ 3 స్థానాలు, కాంగ్రెస్ 2 స్థానాలను గెలుచుకున్నాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత టీఎంసీ ప్రభ కోల్పోయిందన్న విమర్శలకు బార్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాలు ఒక విధంగా చెక్ పెట్టాయని చెప్పాలి.
Mamata Banerjee, TMC victory, West Bengal Bar Council, Bengal politics, Bar Council election results



.webp)


