Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టైలర్ కొడుకు సంచలనం: కెనడా కంపెనీలో రూ. 1.06 కోట్ల ఏఐ జాబ్!
posted on: Jul 30, 2026 10:37AM
![]()
కఠోర శ్రమ, చెరగని పట్టుదల ముందు పేదరికం తలవంచక తప్పదని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక సాధారణ గ్రామీణ యువకుడు నిరూపించాడు. తండ్రి దర్జీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటే, ఆ కష్టాన్ని కళ్లేదుట చూస్తూ పెరిగిన ఆ కుర్రాడు అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత శిఖరాలను అధిరోహించాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతలో అసాధారణ ప్రతిభను కనబరిచి, కెనడాకు చెందిన ప్రముఖ టెక్ సంస్థలో ఏకంగా ఏడాదికి రూ. 1.06 కోట్ల వేతనంతో ఏఐ ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ అద్భుత విజయంతో తన కుటుంబానికే కాకుండా పాఠశాల, కళాశాలలకు మరియు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఎంతో గర్వకారణంగా నిలిచాడు.
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు. కొత్తపల్లి మండలం కుతుకుడుమిల్లి గ్రామానికి చెందిన మాల్తి అఖిలేశ్ కథ ఇది. అఖిలేశ్ కుటుంబ నేపథ్యం చాలా సాధారణమైనది మరియు ఆర్థికంగా అనేక ఇబ్బందులతో కూడుకున్నది. ఆయన తండ్రి గంగాధరరావు వినికిడి మరియు మాటల వైకల్యంతో బాధపడుతున్నప్పటికీ, ఏనాడూ అధైర్యపడలేదు. గ్రామంలో టైలరింగ్ పని చేస్తూ వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించారు. తల్లి దేవి కూడా భర్త కుట్టిన బస్త్రాలకు చేతిపనులు చేస్తూ, కూలీ పనులకు వెళ్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచింది. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులు తమ కుమారుడు అఖిలేశ్ ఉన్నత చదువులు చదవాలని రాత్రింబవళ్లు కష్టపడి ప్రోత్సహించారు.
తల్లిదండ్రుల నిరంతర శ్రమను గమనించిన అఖిలేశ్ చిన్నప్పటి నుంచే చదువులో ఎంతో ప్రతిభ కనబరిచాడు. కొత్తపల్లిలోని వివిఎస్ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి వరకు ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. అనంతరం కాకినాడలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ కోర్సును విజయవంతంగా పూర్తి చేశాడు. ఆ తర్వాత ఈఏపీసెట్ (EAPCET) ప్రవేశ పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించి, పెద్దాపురం సమీపంలోని సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో బి.టెక్ డేటా సైన్స్ విభాగంలో సీటు సంపాదించాడు. ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం నుంచే కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాడు.
ఇంజినీరింగ్ చివరి సంవత్సరంలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ సమయంలో అఖిలేశ్‌కు మొదట్లో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. వేర్వేరు కంపెనీల ఇంటర్వ్యూలకు హాజరైనప్పుడు వరుసగా 3 సార్లు తిరస్కరణలు ఎదురయ్యాయి. అయినప్పటికీ అఖిలేశ్ నిరాశ చెందకుండా, తన లోపాలను సరిదిద్దుకున్నాడు. ప్రస్తుతం ఐటీ ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మరియు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకున్నాడు. సొంతంగా ప్రాజెక్టులు రూపొందిస్తూ ప్రయోగాత్మక పరిజ్ఞానాన్ని పెంచుకున్నాడు.
tailor son gets 1 crore package canada firm,aditya university student bags 1 crore ai job


(16).webp)



