Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తిరుపతిలో మల్లారెడ్డి వర్సిటీ.!
posted on: Jul 11, 2026 9:42AM

తెలంగాణ రాజకీయాల్లో, విద్యా రంగంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న విద్యావేత్త, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తన విద్యాసంస్థల ఏర్పాటుపై దృష్టి సారించారు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేయనున్నట్లు చామకూర మల్లారెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ భారీ విద్యా ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి అవసరమైన అన్ని రకాల అధికారిక అనుమతులు లభించాయని వెల్లడించారు.
శుక్రవారం (జులై 10) తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మల్లారెడ్డి, మీడియాతో మాట్లాడుతూ గత మూడున్నర దశాబ్దాలుగా విద్యా రంగంలో ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ నిరంతర సేవలు అందిస్తున్నానన్న ఆయన.. పవిత్ర తిరుపతి నగరంలో ఒక అద్భుతమైన యూనివర్సిటీని స్థాపించాలనేది తన స్వప్నమని చెప్పారు. ఆ స్వప్నం ఇప్పుడు సాకారం అవుతోందన్నారు. నిజానికి గత ఏడాదే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆలోచన చేశాననీ, అది ఇప్పుడు కార్యరూపం దాల్చిందని మల్లారెడ్డి చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పదుల సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు మరియు డీమ్డ్ యూనివర్సిటీలతో అత్యంత బలమైన విద్యా నెట్‌వర్క్‌ను నిర్మించుకున్న మల్లారెడ్డి.. ఇప్పుడు జాతీయ స్థాయిలో తన ముద్ర వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ విస్తరణ ప్రణాళికల్లో భాగంగానే ఆయన గతేడాది తిరుపతిలో ఒక ఇంజనీరింగ్ కళాశాలను కొనుగోలు చేశారు. అంతటితో ఆగకుండా, అదే ఏడాది నవంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ లోని మరో కీలక నగరమైన విశాఖపట్నంలోనూ ఒక ఇంజనీరింగ్ కళాశాలను కొనుగోలు చేశారు. కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా.. దేశవ్యాప్తంగా అద్భుతమైన ప్రమాణాలతో కూడిన మరిన్ని విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలన్నదే తన లక్ష్యమని ఈ సందర్భంగా మల్లారెడ్డి చెప్పారు.
Malla Reddy Varsity in Tirupati, Tirupati Deemed University, Malla Reddy AP Colleges, Medchal MLA, University Expansion, Malla Reddy Educational Institutions






