Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అంబర్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం
posted on: Apr 27, 2026 4:22PM
.webp)
హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట్ చే నంబర్ చౌరస్తా వద్ద సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రధాన రహదారిపై ఉన్న రెనాల్ట్ మరియు మహేంద్ర కారు షోరూమ్‌లలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా భయాందోళనకు గురైంది.
షోరూమ్‌లో నిలిపి ఉంచిన వాహనాలకు మంటలు అంటుకోవడంతో అగ్ని వేగంగా వ్యాపించింది. దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేయడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో ప్రధాన రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.మంటలను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడగా, పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
అగ్ని ప్రమాదం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చుట్టుపక్కల నివాస ప్రాంతాల ప్రజలను పోలీసులు, స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దట్టమైన పొగల కారణంగా అక్కడి ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు.



.webp)


