మహిళా వివక్ష

మహిళలు దూసుకుపోతున్నారు....అన్నిరంగాల్లో  మగాళ్లతో పోటీ పడుతున్నారు...కాదుకాదు మగాళ్లను మించిపోతున్నారు..... ఈ మధ్య కాలంలో ఎక్కడ చదివినా విన్నా ఈ మాటలే. కానీ ఎంత అభివృద్ధి చెందితే ఏంటి? ఏ స్థాయికి చేరితే ఏంటి? అమ్మాయిపై వివక్ష లేకుండా పోయిందా? అంతెందుకు నిత్యం ఎక్కడోదగ్గర అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఒక్కరూ స్పందించరు. తెలిసిన వెంటనే అయ్యో పాపం అనేసి వదిలేస్తారు. అదే నూటికో కోటికో  భర్తను హత్య చేసిన భార్య.....అనే వార్త చదవగానే పురషాధిక్య సమాజం నిద్రలేస్తుంది. అమ్మో ఆడాళ్లు అని తెగ గందరగోళం చేసేస్తారు. తప్పు ఎవరు చేసినా తప్పే అయినప్పుడు ఎందుకీవివక్ష?

 

మిగిలిన అన్ని రంగాలు పక్కనపెడతాం....జనాలకు బాగా తెలిసిన సినిమా రంగాన్నే తీసుకుందాం. ఈ రంగంలో ఉన్న మహిళా వివక్ష ఇంకెక్కడైనా ఉందా?  హీరోయిన్ గాఛాన్స్ దక్కించుకోవాలన్న దగ్గరనుంచి స్టార్ స్టేటస్ తెచ్చుకునే వరకూ ఎన్ని కష్టాలు పడాలో.....ఎందరు చెప్పినట్టు వినాలో అందరకీ తెలిసిందే! కోటి ఆశలతో ముఖానికి రంగేసుకుందాం అని వచ్చి రకరకాల మనుషుల్ని-మనస్తత్వాల్ని ఎదుర్కోవాలి. తెరవెనుక రాజకీయాల్లో మునిగితేలి...దేనికైనా సిద్ధం అనే స్థాయికి చేరుతున్నారు.

 

అయితే....అమ్మాయి తప్పుచేస్తే బహిరంగంగా విమర్శించే వ్యక్తులు, మీడియా....అందులో సెలబ్రెటీలు ఉన్నప్పుడు మాత్రం ఎందుకు నోరుమూసుకుంటోంది?

 

ఈ మధ్యే శ్వేతాబసు ప్రసాద్ అనే తార...వ్యభిచారం చేస్తూ పట్టుబడిందని ఎంతో హడావుడి చేశారు. కొత్తబంగారు లోకంలో ఈ అమ్మాయిని చూసి కెరీర్లో మంచి స్థాయికి  వెళుతుందని ఊహించిన వారంతా ఈ విషయం తెలిసి ఖంగుతిన్నారు. ఓ హోటల్లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిందని...ఒక్కొక్కరికి ఒక్కో రేటు ఫిక్స్ చేసిందని వార్తలు ప్రసారమయ్యాయి. అప్పటి వరకూ చాలామందికి తెలియన శ్వేతా బసు ప్రసాద్ ఫొటో చుట్టూ మార్క్ వేసి పదే పదే చూపించి గోలగోల చేశారు.

 

అయితే శ్వేతాబసు ప్రసాద్ వ్యభిచారం చేస్తోందని అన్నవారంతా.....ఆమెతో పాటూఉన్న విటుల గురించి మాట్లాడరేం? ఆమె వల్లో పెద్ద చేపలే ఉన్నాయని చెబుతున్నారే కానీ....వాళ్లెవరో తెలీదా? తెలిసినా వలవేసే సాహసం చేయరా?  సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు అని మాత్రం రాస్తారు. అటు పోలీసులు కూడా  శ్వేతా చాలా పేర్లు చెప్పిందని చెప్పారే కానీ.....ఒక్కపేరు కూడా ఎందుకు  బయటపెట్టలేదు?  ఏ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారు?

 

అంతకు ముందు నటి కిన్నెరపై ఓ ప్రైవేట్ ఛానెల్ స్టింగ్ ఆపరేషన్ చేసింది. రిపోర్టర్ చాలా రిస్క్ చేసింది కూడా. ఆమె ఇంటికి వెళ్లి...కిన్నెర రిసీవింగ్, మాటతీరు, ఎలా వలవేస్తోంది....ఎక్కడెక్కడకు తీసుకెళుతోంది అనే విషయాలన్నింటినీ బాగా సేకరించారు. మర్నాడు ఓ ప్రముఖుని ఇంటికి తీసుకెళ్లిన కిన్నెరను అడ్డంగా బుక్ చేశారు. అయితే ఆ సమయంలో కూడా సదరు ఛానెల్ కిన్నెర గురించి ఊదరగొట్టిందే కానీ.....ఆ కోణంలో ఆమెను ఉపయోగించుకుంటున్న పెద్దమనుషులెవరనేది బయట పెట్టలేదు. గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇంటికి తీసుకెళ్లింది అని రాశారే కానీ ఆ కేంద్రమంత్రి ఎవరో వాళ్లకి తెలియదా? ఓ ఆడపిల్లను బయట పెట్టినంత సులువుగా వాళ్లనెందుకు నిలదీయడంలేదు? సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తుల పేర్లు బయటపెట్టే దమ్ము లేదా? తప్పు చేసినా వాళ్లకి గొడుగుపడుతూనే ఉంటారా? లేదా  సదరు ఛానెల్ నిర్వహకులు వాళ్లని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకున్నాక కిమ్మనకుండా ఉండిపోయారా? ఏం జరిగింది?

 

అంతెందుకు పోలీసులు సైతం... నేరస్తులను మీడియా ముందు ప్రవేశ పెట్టాలంటే వాళ్లకి ముసుగులు వేసి తీసుకొస్తారు. చేతులు కట్టేసినా....కనీసం కెమెరా ముందు కూడా మసుగు తీయరు. కానీ వ్యభిచారం  కేసులో ఎక్కడైనా అమ్మాయిలు పట్టుబడితే చాలు....బహిరంగంగా తీసుకెళతారు. వాళ్ల ఫొటోలు, వివరాలతో సహా  మీడియాకు సమాచారం ఇస్తారు. మీడియా కూడా అంతే ఉత్సాహంగా...ఎక్కడైనా ఇలాంటి కేసులుంటే కెమెరా ఫోకస్ మొత్తం అమ్మాయిలపై పెడతారే కానీ....అక్కడున్న బడాబాబులవైపు ఒక్కసారి ఫోకస్ చేయరు. ఇండస్ట్రీ లోనే కాదు మీడియా లోనూ కెమెరా ఫోకస్ కేవలం అమ్మాయిలపైనేనా?

 

కొన్ని కేసుల్లో  అమ్మాయి ఒంటిమీద బట్టలేసుకునే సమయంలో కూడా కెమెరా పక్కకు తిప్పాలనే సంస్కారం ఉండడం లేదు. పైగా వాళ్లు అలా ఉండగా లేనిది మేం తీస్తే తప్పా అంటారు? వాళ్ల లాగే మీరూ గడ్డితింటారా?

 

కేవలం శ్వేతాబసు ప్రసాద్, కిన్నెర మాత్రమే కాదు  భువనేశ్వరి, దివ్యశ్రీ సహా  పలువురు బుల్లి తెర నటులు...ఇంకా బయటపడిన, బయటపడని ఇలాంటి వాళ్లెందరో. కారణాలేవైనా నిజంగా వాళ్లు అదే దార్లో ఉన్నట్టైతే  వాళ్లు చేస్తున్నది తప్పే. ఇందులో ఎంతమాత్రం సందేహం లేదు. ఎవ్వర్నీ మేం సమర్థించడం లేదు. కానీ వ్యభిచారం చేస్తున్నారని ఆరోపించినప్పుడు....వాళ్లతో ఎంజాయ్ చేసే వ్యక్తులు పేర్లుసైతం బయటపెట్టాలనేదే మా వాదన.

 

ఎప్పుడూ తమ ఛానెల్స్ కు రేటింగ్ రావాలనే తాపత్రయమే తప్ప...ఎదుటి వ్యక్తి జీవితంతో ఆడుకుంటున్నామమే స్పృహ ఉండదా?

 

రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం అని ఊదరగొట్టే పోలీసులు..ఆమెతో  ఎవరెవరున్నారు అని అడిగితే....నీళ్లు నములుతారు. ఈ బాగోతం వెనుక సినీ, రాజకీయ ప్రముఖులున్నారు అంటారు. కానీ ఎన్నిసార్లు అడిగినా వాళ్ల పేర్లు మాత్రం బయటపడకుండా జాగ్ర్తత్తలు తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో హీరోయిన్స్ ని కొందరు సేవ్ చేస్తున్నారంటే....వాళ్ల పేర్లు ఎక్కడ బయటపడతాయో అనే భయంతో మాత్రమే.

 

మీడియా, పోలీసుల ప్రతాపం మామూలు వాళ్లపైనేనా? గట్టిగా అడిగే దిక్కులేనివారందర్నీ బజారు కీడ్చడానికేనా?

 

ఎంకరేజ్ చేసే వాళ్లున్నంత వరకూ ఇలాంటి తెరవెనుక వ్యవహారాలు నడుస్తూనే ఉంటాయి. తీరా బయటపడ్డాక బడా బాబులు ముసుగేసుకుని దొరికిన అమ్మాయిలకు ముసుగు తీసేస్తున్నారు.

 

మేం అమ్మాయిలని సమర్థించడం లేదు....తప్పుని ఒప్పు అని సమర్ధించడం లేదు. సమన్యాయం ఉండాలని కోరుకుంటున్నాం. వ్యభిచార ముఠా గుట్టు రట్టు అని చెప్పినప్పుడు మొత్తం ఎంతమంది దొరికితే అందర్నీ పట్టుకోండి. వారి వెనుకున్న పెద్దచేపలను బయటకు లాగండి. ఉన్నతాధి కారుల నుంచి, పెద్దవారినుంచి పోలీసులకు ఒత్తిడిలు  ఉన్నప్పటికీ తప్పుని సమర్థించని రోజు....ఈ వృత్తిలోకి దిగేవాళ్లు, వాళ్లని ఎంకరేజ్ చేసేవాళ్లు, పెద్దమనుషులుగా చెలామణి అవుతూ బాగోతాలు నడిపేవాళ్లు భయపడతారు.

 

ఎప్పటికైనా ఈ పరిస్థితిలో మార్పు వస్తుందనే ఆశించవచ్చా....?

Online Jyotish
Tone Academy
KidsOne Telugu