Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సాండ్రాని హగ్ చేసుకోవడానికి వీల్లేదు...మహేష్ పెట్టిన రూల్ ఇదే!
posted on: Mar 16, 2026 4:42PM

బుల్లితెర మీద సాండ్రా - మహేష్ కాళిదాసు గురించి తెలియని వాళ్లుండరు. వీళ్ళు చాలా సీరియల్స్ లో నటించారు. మానసిచ్చి చూడు సీరియల్ ద్వారా మహేష్ తెలుగు ఆడియన్స్ ని సంపాదించుకున్నాడు. వీళ్లిద్దరు గత ఏడాది పెళ్లి చేసుకున్నారు. సాండ్రాకి ఆల్రెడీ మొదట పెళ్ళి అయ్యింది తర్వాత డివోర్స్ తీసుకుంది. ఇక ఇప్పుడు ఆ దేవుడి దయ వలన మహేష్ వచ్చాడంటూ చాల ఇంటర్వ్యూస్ లో చెప్పింది. ఇప్పుడు వీళ్ళు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోకి వచ్చారు. ఇందులో పెళ్ళికి ముందు మహేష్ ఒక కండిషన్ పెట్టాడంటూ శ్రీముఖి రివీల్ చేసింది. దాంతో జడ్జెస్ ఎం కండిషన్ అని అడిగారు. "పెళ్లయ్యాక ఎలా ఉండాలో అన్న రూల్స్ అవి. మేల్స్ ని హగ్ చేసుకోకూడదు" అని చెప్పాను అన్నాడు మహేష్. "ఏంటి వన్ సైడ్ రూలేనా " అంటూ జడ్జి లయ అడిగింది.
"ఇది పెద్ద సమస్య కాదు. నువ్వు అంతలా చెప్తున్నావ్ కాబట్టి నువ్వు కూడా అదే రూల్ ఫాలో అవ్వు" అని చెప్పా అంటూ సాండ్రా చెప్పింది. ఇక శ్రీముఖి నన్ను హగ్ చేసుకోకుండా మాన్షన్ లోకి పంపించను అని చెప్పింది. కానీ మహేష్ నో అంటే నో అనేశాడు. "పెళ్ళికి ముందు పార్టీస్ కి వాటికి వెళ్లే వాళ్ళం వాళ్లంతా సాండ్రాని పైకి ఎత్తేసేవాళ్ళు" అన్నాడు మహేష్. "ఇప్పుడు ఈ రూల్ పెట్టడంలో తప్పు లేదయ్యా " అంటూ అనిల్ రావిపూడి మహేష్ ని వెనకేసుకొచ్చాడు. "ఇది హగ్గుల రూల్స్. అందరికీ చెప్తున్నా సాండ్రాని ఎవరూ హగ్ చేసుకోవడానికి రావొద్దు " అంటూ శ్రీముఖి అందరికీ వార్నింగ్ ఇచ్చింది.






