గుంటూరులో మహేష్‌బాబు ప్రచారం?
posted on: Apr 17, 2014 3:15PM
.jpg)
గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి ‘ప్రిన్స్’ మహేష్‌బాబు బావ, గల్లా అరుణకుమారి కుమారుడు గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలలో మహేష్ తన బావకి ఎన్నికల ప్రచారం చేస్తాడా,లేదా అనే సందేహం రాజకీయ వర్గాల్లో నెలకొని వుంది. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి మహేష్‌బాబుకి ఇష్టం వుండదని ఆయన మనసు తెలిసిన వారు చెబుతున్నారు.
అయితే మహేష్ మనసు మార్చుకుని ప్రచారం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మళ్ళీ వారే అంటున్నారు. అయితే మహేష్‌బాబును ప్రచారం కోసం గుంటూరుకు తీసుకురావడానికి గల్లా కుటుంబం శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మహేష్ బాబు మాత్రం రాకుండా వుండటానికే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.
ఒక్కసారి రాజకీయ ప్రచారానికి వస్తే ఇతర పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు అవకాశం దొరికితే తనమీద కూడా విమర్శలు కురిపించే అవకాశం వుందని, అలా ఇతరులకు అవకాశం ఇవ్వడం ఎందుకని మహేష్ బాబు అంటున్నట్టు తెలుస్తోంది. అయితే వివాదాస్పద అంశాల జోలికి పోకుండా, రాజకీయాల గురించి మాట్లాడకుండా జయదేవ్‌కి ఓటు వేయండని చెప్తే సరిపోతుందని మహేష్‌కి సర్ది చెబుతున్నట్టు తెలుస్తోంది.
అయితే మహేష్ బాబు ఇప్పటికే ట్విట్టర్‌లో తన బావకి ప్రచారం చేస్తున్నాడు. మంచి వ్యక్తి అయిన జయదేవ్ రాజకీయాల్లో కొనసాగడానికి అన్నివిధాల అర్హుడని మహేష్ ట్వీట్ చేశాడు. అలాగే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో తన బావకు సహరించాలని ఇప్పటికే తన ఫ్యాన్స్ కి మహేష్ సందేశాన్ని పంపినట్టు తెలుస్తోంది.


.jpg)
.jpg)


