శివాలయాలకు పోటెత్తిన భక్తులు
posted on: Feb 15, 2026 10:12AM

మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలకు భక్తులు పొటెత్తారు. ఏపీలోని శ్రీశైలం, శ్రీకాళహస్తి, దాక్షరామం, కోటప్పకొండ వంటి క్షేత్రాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. తెలంగాణలో వేములవాడ, కాళేశ్వరం, కీసర, రామప్ప ఆలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఇక శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుండే స్వామి, అమ్మవార్లను భక్తులు దర్శించుకుంటున్నారు.
సాయంత్రం 5గంటలకు స్వామి, అమ్మవార్లకు ప్రభోత్సవం జరగనుంది. పల్నాడులోని కోటప్పకొండకు సైతం భారీగా భక్తులు తరలివెళుతున్నారు. త్రికోటేశ్వర స్వామి దర్శనానికి క్యూ లైన్లలో భారీగా భక్తులు క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, జాగరణలతో శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తుల రద్దీ దష్ట్యా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.


.webp)



