Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పవన్ కల్యాణ్ కు మహా సీఎం పరామర్శ.!
posted on: Jul 14, 2026 10:10AM

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ముంబైలోని కోకిలాబెన్ అంబానీ హాస్పిటల్‌లో భుజానికి ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. సర్జరీ పూర్తయిన అనంతరం ఆస్పత్రిలో కోలుకుంటున్న పవన్ కల్యాణ్ ను పరామర్శించేందుకు పలువురు ప్రముఖులు కోకిలాబెన్ ఆస్పత్రికి క్యూకడుతున్నారు. అలా పరామర్శకు వచ్చిన వారిలో జాతీయ స్థాయి నేతలు కూడా ఉండటం.. దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు దర్పణం పడుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముంబై వెళ్లి పవన్ కళ్యాణ్‌ను కలిసి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా కోకిలాబెన్ హాస్పిటల్‌కు విచ్చేసి ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించారు.
హాస్పిటల్‌కు చేరుకున్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, పవన్ కళ్యాణ్‌తో చాలా సేపు భేటీ అయ్యారు. సర్జరీ తర్వాత పవన్ ఆరోగ్యం ఎలా ఉందనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో కూడా మాట్లాడి ఆయన ఆరోగ్యపరిస్థితిని ఆరా తీశారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఇద్దరు కీలక నేతల మధ్య సుహృద్భావ పూరిత వాతావరణంలొ చర్చలు జరిగాయని తెలుస్తోంది. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని సాధించి రికార్డు సృష్టించింది.
పవన్ కళ్యాణ్ చేసిన ఆనాటి ఎన్నికల ప్రచారం, చూపి ప్రభావానికి కృతజ్ఞతగా, ఆయనపై ఉన్న అపారమైన గౌరవంతో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా హాస్పిటల్‌కు వచ్చి పరామర్శించారు. సర్జరీ నిమిత్తం ముంబై హాస్పిటల్లో చేరిన ఆయనను కలవడానికి కాగా తనను పరామర్శించడానికి వచ్చిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.
Pawan Kalyan, Devendra Fadnavis, Pawan Kalyan Surgery, Mumbai Kokilaben Hospital, Chandrababu Naidu, Maharashtra CM Meets Pawan Kalyan






