సీఎస్ కే ను చిత్తు చేసిన ఎల్ఎస్ జీ

posted on: May 16, 2026 8:17AM

ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలింగ్‌లో ఆకాశ్ సింగ్ ) అదరగొట్టగా, బ్యాటింగ్‌లో మిచెల్ మార్ష్ కేవలం 38 బంతుల్లో 90 పరుగులతో  విధ్వంసకర ఇన్నింగ్స్‌తో  చెలరేగి లక్నోసూపర్ జెయింట్స్ కు చిరస్మరణీయమనదగ్గ విజయాన్ని అందించారు. లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో  వేదికగా శుక్రవారం ( మే 15) జరిగిన ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్  188 పరుగుల  లక్ష్యాన్ని లక్నో మరో 20 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన  చెన్నై సూపర్ కింగ్స్‌ను ఆకాశ్ సింగ్ అద్భుత బౌలింగ్ తో కట్టడి చేశాడు.  గైక్వాడ్, శాంసన్, ఉర్విల్ పటేల్‌లను పెవిలియన్‌కు పంపి చెన్నై టాప్ ఆర్డర్‌ను కూల్చాడు. కష్టాల్లో పడిన జట్టును కార్తీక్ శర్మ  42 బంతుల్లో 71పరుగులు, డెవాల్డ్ బ్రెవిస్  పాతిక పరుగులతో ఆదుకున్నారు. చివరిలో చివర్లో శివమ్ దూబే  6 బంతుల్లో 32 నాటౌట్తో  మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.

188 పరుగుల లక్ష్య ఛేదనతో బ్యాటింగ్ చేపట్టిన లక్నో సూపర్ జెయింట్స్ కు  ఓపెనర్లు మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్  32 బంతుల్లో 36 తొలి వికెట్‌కు 135 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ముఖ్యంగా మార్ష్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అతడు.. 9 ఫోర్లు, 7 సిక్సర్లతో చెన్నై బౌలర్లను చీల్చి చెండాడాడు. సెంచరీకి కేవలం 10 పరుగుల దూరంలో దురదృష్టవశాత్తు రనౌట్‌గా వెనుదిరిగాడు. మార్ష్ నిష్క్రమణ తర్వాత నికోలస్ పూరన్  17 బంతుల్లో 32 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. లక్నోసూపర్ జెయింట్స్ ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఓటమితో  చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు  సంక్లిష్టంగా మారాయి.  

google-ad-img
    Related Sigment News
    • Loading...