Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇన్ స్టా పరిచయంతో ప్రేమ.. ఏపీకి చేరిన జార్ఖండ్ వనిత.. చివరికేం జరిగిందంటే?
posted on: Feb 20, 2026 9:43AM

సోషల్ మీడియా పరిచయాలు ఎటువంటి విపరీత పరిణామాలకు దారి తీస్తున్నాయనడానికి పలు ఉదంతాలు ఉన్నాయి. అనైతిక సంబంధాలు, అసాంఘిక పనులకు కొందరు సామాజిక మాధ్యమాన్ని సాధనంగా, ఆయుధంగా వాడుకుంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఏర్పడిన పరిచయం ఓ వివాహితను ఇబ్బందుల్లో పడేసింది.
వివాహమై, పిల్లలున్న ఓవివాహిత సోషల్ మీడియా మాయలో పడింది. జార్ఖండ్ కు చెందిన ఆ యువతికి సోషల్ మీడియాలో ఏపీకి చెందిన ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. అతడిని నమ్మి ప్రేమలో పడింది. వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్‌కు చెందిన 30 ఏళ్ల వివాహితకు ఇన్ స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు గంటల కొద్దీ చాటింగ్‌లో మునిగితేలారు. ఆపై ఆడియో, వీడియో కాల్స్ కూడా నడిచాయి. వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తనను ధనవంతుడిగా, అనుభవం ఉన్న వ్యాపారవేత్తగా పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి మాటలను ఆమె పూర్తిగా నమ్మి భర్త, ముగ్గురు చిన్నారులను వదిలి ఇన్‌స్ట్రాగ్రామ్ ప్రియుడితో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఏపీ చేరుకుంది. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో తన ఆన్ లైన్ ప్రియుడ్ని కలుసుకుంది.
ఆ తరువాతే అసలు నిజం బయటపడింది. తనను తాను ధనవంతుడు అని చెప్పుకున్న వ్యక్తి వాస్తవానికి దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. దీంతో ఆమె షాక్ గురైంది. మోసపోయానని గ్రహించి తీవ్ర నిరాశకు లోనైంది.. ఇంతలో ఆమె కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఫోన్ సిగ్నల్, సోషల్ మీడియా వివరాల ఆధారంగా ఆమె ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. పోలీసుల జోక్యంతో మహిళను సురక్షితంగా తీసుకువచ్చారు. తల్లిదండ్రులు, బంధువులు కలిసి ఆమెకు నచ్చజెప్పడంతో చివరకు తిరిగి తన కుటుంబం వద్దకు చేరింది.


.webp)



