గుంటూరు పార్లమెంట్ నేతలతో లోకేష్ ఆత్మీయ విందు

posted on: May 1, 2026 9:59PM

 

కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నివాసంలో గుంటూరు పార్లమెంట్ కు చెందిన ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు సమావేశం జరిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని పెమ్మసాని నివాసంలో జరిగిన ఈ విందు భేటీకి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలతో పాటు గుంటూరు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై నేతలు చర్చించారు. 

ప్రజాప్రభుత్వం 22 నెలల పాలనలోనే రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చాయని, తద్వారా యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతంపైనా నేతలు సమాలోచనలు జరిపారు. ఈ సమావేశంలో గుంటూరు ఎంపీ, కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు మహ్మద్ నసీర్, బూర్ల రామాంజనేయులు, తెనాలి శ్రావణ్ కుమార్, గల్లా మాధవి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, గుంటూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు, ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...