Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మాది గూగుల్.. మీది గొడ్డలి.. మాది జెట్.. మీది ఫ్యాక్షన్.. మహానాడు వేదికగా జగన్ పై లోకేష్ విమర్శలు
posted on: May 27, 2026 6:18PM

తెలుగుదేశం మహానాడు వేదికగా మంత్రి నారా లోకేష్ వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. వర్చువల్ గా జరుగుతున్న ఈ మహానాడులో తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా ప్రసంగించిన లోకేష్ వైసీపీపైనా, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ హయాంలో పాలనలో తెలుగుదేశం కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, తనపైనే 23 కేసులు పెట్టి వేధించారని, అయినా తాము వెనక్కి తగ్గలేదని గుర్తు చేశారు.
మాట తప్పం.. మడమ తిప్పం అన్న నినాదంతోనే ముందుకు సాగామన్న లోకేష్. గత వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు, దాడులను ప్రజలు ఇంకా మరచిపోలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చకు తాను సిద్ధమన్న ఆయన.. గత ప్రభుత్వ పాలనతో ప్రస్తుత ప్రభుత్వ పనితీరును పోల్చేందుకు ఓపెన్ డిబేట్‌కు రావాలని సవాల్ చేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని లోకేశ్ ప్రశంసించారు. చంద్రబాబులో ఇప్పటికీ యువతరానికి సరిపోయే ఉత్సాహం ఉందనీ, ఆయన జెట్ స్పీడ్‌తో పని చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తుండటానికి చంద్రబాబు విజన్ కారణమన్నారు. నేషన్ ఫస్ట్ అనేది టీడీపీ సిద్ధాంతమని చెప్పారు. వైకాపా వేధింపులు తట్టుకోలేక నంద్యాలలో ఓ కుటుంబం సూసైడ్ చేసుకుంది. ఎంతో మంది బీసీ, ఎస్టీ, మైనారిటీ సోదరులను చంపేశారని గుర్తు చేశారు. బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్‌ను ఏకంగా కిరోసిన్ పోసి చంపేశారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దళిత డ్రైవర్ సుబ్రమణ్యాన్ని చంపేసి.. డోర్ డెలివరీ చేసి చరిత్ర మీది అంటూ విమర్శించిన లోకేష్.. గొడ్డలి పార్టీ అంటే వైసీపీకి కోపం వచ్చింది. మాది గూగుల్.. మీది గొడ్డలి. మాది ఫైటర్ జెట్.. మీది ఫ్యాక్షన్. మాది కియా అయితే.. మీది కిడ్నాప్ అంటూ విమర్శలు గుప్పించారు. టీడీపీ కార్యకర్తలే పార్టీకి అసలైన అధినేతలన్న లోకేష్.. మహానాడును కార్యకర్తల పండుగగా అభివర్ణించా3రు. ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా మహానాడు సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతుందన్నారు.


.webp)


