ప్రజానాయకుడి ప్రజాదర్బార్!

ఆంధ్రప్రదేశ్ లో.. ఆ మాటకొస్తే దేశంలోనే  ఇప్పుడున్న అగ్రశ్రేణి రాజకీయ నేతలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అందరి కంటే సీనియర్ అని చెప్పడానికి ఎటువంటి సందేహం అవసరం లేదు. సీనియారిటీలోనే కాదు.. ఆయన స్టేచర్, అనుభవం, దార్శనికతలలో మేటిగా నిలుస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆయనకు సాటి రాగల నేత కాగడా పెట్టి వెతికినా కనబడరు. అయితే ఆయన అంత సీనియారిటీ లేకపోయినా, యువనేత, మంత్రి నారాలోకేష్ ను చంద్రబాబుతో పోటీ పడుతున్న నేతగా చెప్పుకోవాల్సి ఉంటుంది.  తెలుగువన్  2023 జులైలో నిర్వహించిన ఆన్ లైన్ పోల్ సర్వేలోనే  చంద్రబాబు తరువాత ఏపీలో బెస్ట్ ఫాలోయింగ్ ఉన్న ప్రజానేతగా నారా లోకేష్ నిలిచారు.  నారా లోకేష్ ఈ స్థాయికి ఎదగడం వెనక కఠోర శ్రమ ఉంది. సెల్ఫ్ డిసిప్లిన్ ఉంది. రాజకీయంగా లోకేష్ తొలి అడుగు వేయకుండానే ప్రత్యర్ధులు ఆయన వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కాదు. బాడీషేమింగ్, ఆయన నడక, మాట ఇలా   కాదేదీ అనర్హం అన్నట్లుగా ప్రత్యర్ధులు శృతి మించి ఆయన్ను తూలనాడారు.

లోకేష్ ఆహారం, ఆహార్యం ఇలా ప్రతి విషయంలోనూ ఆయనను గేలి చేశారు. రాజకీయాలలో తొలి అడుగు కూడా పడకుండానే ఆయన నడకను ఆపేయాలని చూశారు. అయితే వాటన్నిటినీ తట్టుకుని నిలబడిన లోకేష్.. తనపై విమర్శలకు తన పనితీరుతోనే బదులిచ్చారు.   బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తో మొదలు పెట్టి బెరుకు లేకుండా, బెదురు లేకుండా నిలదొక్కుకుని ఇప్పుడు ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంగా మారారు. ఆ క్రమంలో ప్రజల హృదయాలనూ గెలుచుకున్నారు. ఇదీ నాడు తెలుగువన్ నిర్వహించిన ఆన్ లైన్ పోల్ సర్వేలో తేలిన వాస్తవం.   

అయితే అప్పటిలో ఆయనకు జనం బ్రహ్మరథం పట్టడానికి అప్పటికి ఆయన  చేస్తున్న యువగళం పాదయాత్ర ప్రధాన కారణమని చెప్పాలి. అయితే తెలుగువన్ ఆన్ లైన్ సర్వే నిర్వహించి రెండేళ్లు దాటిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి కూడా 16 నెలలు గడిచిపోయింది. పార్టీలో, ప్రభుత్వంలో ఇప్పుడు నారా లోకేష్ అత్యంత కీలకం. ఈ స్థితిలో ఆయనలో, ఆయన వ్యవహార శైలిలో  ఏదైనా మార్పు ఉందా? అంటే పరిశీలకులు అబ్బో చాలా చాలా మార్పు ఉందంటున్నారు. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో విజయం సాధించి తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన మరింతగా ప్రజలతో మమేకమౌతున్నారని అంటున్నారు. ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఆయన చూపే చొరవ.. అక్కడికక్కడ తీసుకునే నిర్ణయాలతో ప్రజల నాయకుడిగా మరింతగా ఎదిగారని చెబుతున్నారు.    

రాష్ట్రానికి పెట్టుబడుల వేటలో వరుస విదేశీ పర్యటనల్లో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉంటూనేజజ ప్రజా సమస్యల పరిష్కారం విషయం అత్యంత ప్రత్యేక దృష్టి సారిస్తూ లోకేష్ ఒకే సమయంలో అటు పెట్టుబడుల వేటలోనూ, ఇటు ప్రజా సమస్యల పరిష్కారం విషయంలోనూ సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్నారు.  ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు తాను రూపొందించుకున్న  ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని లోకేష్ అత్యంత శ్రద్ధగా నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలోనే మంగళవారం (అక్టోబర్ 4) మంగళగిరిలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. లోకేశ్ ను కలిసేందుకు వచ్చిన జనంతో అక్కడ అర కిలోమీటర్ కు పైగా క్యూ లైన్ ఏర్పడింది.ఇది తమ సమస్యల పరిష్కారం విషయంలో లోకేష్ పట్ల ప్రజలలో ఉన్న విశ్వాసం, నమ్మకానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.  

ఉదయం 11 గంటలకు మొదలైన ఈ ప్రజాదర్భార్ లో లోకేష్ తో వ్యక్తిగతంగా సంభాషించి తమ సమస్యలు తెలుపుకోవడానికి వచ్చిన వేలాది మందిని ఆయన నిరాశపరచలేదు. దాదాపు నాలుగువేల మందిని కలిసి వారి సమస్యలను ప్రత్యక్షంగా విని వాటి పరిష్కారం విషయంలో భరోసా ఇచ్చారు. తెలుగుదేశం  కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చిన తరువాత   జూన్ 15, 2024న లోకేష్ ఈ ప్రజాదర్బార్ ను ప్రారంభించారు.  ప్రజల నుంచే నేరుగా వారి సమస్యలు తెలుసుకుని వాటిని వీలైనంత వేగంగా పరిష్కరించే నాయకుడిగా లోకేష్ లోకేష్ ఈ కార్యక్రమం ద్వారా జనాలకు మరింత చేరువ అవుతున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu