Latest News
మెటా గ్లోబల్ పాలసీ హెడ్ తో లోకేష్ భేటీ
posted on: Jan 22, 2026 11:36AM

దావోస్‌లో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా దిగ్గజం మెటా గ్లోబల్ పాలసీ విభాగాధిపతి కెవిన్ మార్టిన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరువురి మధ్యా ఏపీలో పెట్టుబడులు, వ్యాపార విస్తరణ అవకాశాలపై చర్చ జరిగింది. విశాఖపట్నంలో ఇప్పటికే ఉన్న మెటా డేటా సెంటర్ సామర్థ్యాన్ని ఆ సంస్థ అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా భారీగా పెంచడంపై చర్చ జరిగింది.
అలాగే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ భాగస్వామ్యంతో రియాలిటీ ల్యాబ్స్-ఫోకస్డ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు ప్రతిపాదనపైనా చర్చ జరిగింది. అంతే కాకుండా రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్, పౌర సేవలను మరింత విస్తృతం చేసేందుకు వాట్సాప్ ఆధారిత సేవలను పెంచాలని కూడా ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. చర్చలు ఫలప్రదంగా సాగాయని, మెటాతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నామని లోకేష్ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు.


.webp)
.webp)


