Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...లోకేష్ కొరియా పర్యటన ఎప్పటి నుంచంటే..?
posted on: Jul 4, 2026 2:53PM

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ కొరియాలో పర్యటించనున్నారు. రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఆహ్వానం మేరకు లోకేష్ ఆదివారం (జులై 5) నుంచి జులై 11 వరకూ ఆ దేశంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ కొరియాలో వివిధ మంత్రిత్వశాఖల ప్రతినిధులతో అధికారిక సమావేశాల్లో పాల్గొంటారు. ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో జరిగే ఈ సమావేశాలలో ఇరుదేశాల నడుమ మరింత సహకారం, సంబంధాల బలోపేతం లక్ష్యంతో లోకేష్ పర్యటన సాగనుంది.
ఆదివారం (జులై 5) దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో ఇండియా డయాస్పోరా ఆత్మీయ సమావేశంలో లోకేష్ పాల్గొంటారు. ఈ సమావేశంలో భారతీయులు, తెలుగువారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ మరుసటి రోజు అంటే జులై 6న దక్షిణ కొరియా టెక్ స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం, అలాగే వివిధ సంస్థలతో పెట్టుబడి చర్చల్లో లోకేష్ పాల్గొంటారు. అలాగే.. హ్యోసంగ్ భారీ పరిశ్రమ సంఘం అధ్యక్షుడు టకేషి యొకోటా, సియోల్ సెమికండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ టేహ్యుంగ్ లీతో సమావేశమవుతారు. ఇక జులై 7న ఎల్జీ కెమ్ గ్లోబల్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ ఎల్జీ ఓవర్ సీస్ కంపెనీస్ హెడ్ యున్ జు కోహ్ ఎల్జీ టవర్స్‌లో ఏర్పాటుచేసిన విందు సమావేశంలో పాల్గొంటారు. ఎల్జీ అనుబంధ సంస్థలకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు ఈ సమావేశానికి హాజరుకానున్నాయి. 8ఇక జులై 8న కొరియన్ మెరైన్ అక్విప్ మెంట్ అసోసియేషన్ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు.
ఆ మరుసటి రోజు.. అంటే జులై 9న కొరియన్ పొలిటికల్ ఎఫైర్స్ డిప్యూటీ మినిస్టర్ మిస్. యుయి-హే సిసిలియా చుంగ్ తో భేటీ అవుతారు. అనంతరం కొరియన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్టిమెంట్స్ డిప్యూటీ మినిస్టర్ కాంచన్ కాంగ్ తో సమావేశమవుతారు. జులై 10 న వివిధ సంస్థల ప్రతినిధులతో పెట్టుబడి చర్చలతోపాటు, కొరియా ఆటో ఇండస్ట్రీ కోఆపరేషన్ ఏజన్సీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు. అదేరోజు రాత్రి సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్–2026 విజయవంతం చేయాలని కోరుతూ కొరియా కంపెనీల ప్రతినిధులతో రోడ్ షోలో పాల్గొంటారు.
scheduled, AP, IT Minister, Indian despora






