Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పది వేలమంది పేదలకు లోకేశ్ జన్మదిన కానుక
posted on: Jan 20, 2026 1:11PM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి లోకేశ్ పుట్టినరోజు నాడు పెద్ద ఎత్తున ప్రజాసంక్షేమ కార్యక్రమాలు నిర్వహించేలా పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. అందులో భాగంగా పదివేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు అనంతపురం జిల్లా మడకశిర టీడీపీ నేతలు తెలిపారు.
నారా లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 23న మడకశిరలో పట్టాలు పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చేతుల మీదుగా వాటిని అందజేయనున్నట్లు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామితెలిపారు. మడకశిర పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన సభాస్థలిని ఆయన సోమవారం (జనవరి 19) పరిశీలించారు. పండుగ వాతావరణంలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.






