Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హస్తన వేదికగా లోకేష్ ఎక్స్ ప్రెస్ అడ్డా!
posted on: Jun 23, 2026 9:04AM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ ఇప్పుడు ఒక యువ నాయకుడు ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ వాయిస్ గట్టిగా వినిపిస్తోంది. రాష్ట్రంలోని ప్రత్యర్థి పార్టీకి ఆయన వాయిస్ రీసౌండ్ తో చెవులు దిబ్బళ్లు పడుతున్నాయి. తాజాగా దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎక్స్‌ప్రెస్ అడ్డా చర్చాగోష్ఠిలో లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రముఖ జాతీయ ఆంగ్ల దినపత్రిక ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో లోకేష్ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చిఅందరినీ ఆకట్టుకున్నారు. ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత, నారా లోకేష్ జాతీయ మీడియాకు సంబంధించిన ఇంత పెద్ద వేదికపై కనిపించడం ఇదే తొలిసారి.
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నేషనల్ ఒపీనియన్ ఎడిటర్ వందిత మిశ్రా వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆమె సంధించిన పలు కీలకమైన, ఆసక్తికరమైన ప్రశ్నలకు నారా లోకేష్ లోతైన విశ్లేషణతో సమాధానాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ఐటీ రంగం విస్తరణ, పారిశ్రామిక అభివృద్ధి, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, యువతకు ఉపాధి కల్పన వంటి అనేక అంశాలపై జరిగే ఎక్స్‌ప్రెస్ అడ్డా వేదికపైకి విప్లవాత్మక మార్పులకు, పాలనా విధానాలకు కేంద్ర బిందువులుగా నిలిచే అత్యున్నత ప్రముఖులను మాత్రమే ఆహ్వానిస్తారు. గతంలో ఈ వేదికపై కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, నితిన్ గడ్కరీ, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ వంటి దిగ్గజాలు పాల్గొని ప్రసంగించారు. ఇప్పుడు ఆ లీగ్‌లో నారా లోకేష్ నిలవడం ఆయన స్థాయిని రుజువు చేస్తోంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నారా లోకేష్, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న ఆయన, 2024 శాసనసభ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఏకంగా 91 వేలకు పైగా ఓట్ల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఈ రికార్డు స్థాయి విజయం ఆయన నాయకత్వ పటిమకు, ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణకు నిదర్శనంగా నిలిచింది.
ఢిల్లీ వేదికగా జరిగిన ఈ ఎక్స్ ప్రెస్ అడ్డా చర్చా కార్యక్రమంలో ఏపీలో జరుగుతున్న మార్పులు, కూటమి ప్రభుత్వ ప్రణాళికలను జాతీయ స్థాయి మేధావులకు లోకేష్ వివరించారు. జాతీయ రాజకీయాల్లోనూ, మీడియా సర్కిల్స్‌లోనూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ, పారిశ్రామిక పరిణామాలు ఎంతటి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయో ఎక్స్ ప్రెస్ అడ్డా స్పష్టం చేసింది. ఒకవైపు నవ్యాంధ్ర నిర్మాణంలో ఐటీ పగ్గాలు పట్టుకుంటూ, మరోవైపు జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు లోకేష్ వేస్తున్న అడుగులు ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఆకట్టుకుంటున్నాయి.


.webp)



