లోకేష్, టెండూల్కర్.. కేవలం పరిచయం కాదు..అంతకు మించిన స్నేహం

posted on: Apr 30, 2026 2:23PM

ఆంధ్రప్రదేశ్   మంత్రి నారా లోకేష్‌ , క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌  మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం కేవలం ఒక సెలబ్రిటీ,  రాజకీయ నాయకుడి మధ్య ఉండే పరిచయం లాంటిది కాదని, అంతకు మించి లోతైన ఆత్మీయత వీరి మధ్య ఉందని ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. సచిన్ టెండూల్కర్ వంటి గ్లోబల్ ఐకాన్‌తో లోకేష్‌కు ఉన్న ఈ సాన్నిహిత్యం రాజకీయ మరియు క్రీడా వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇటీవల ఒక ప్రత్యేక సందర్భంలో వీరిద్దరూ కలిసినప్పుడు, వారి మధ్య జరిగిన సంభాషణ చాలా హుందాగా, ఆత్మీయంగా సాగింది. సచిన్ టెండూల్కర్ క్రీడా రంగానికి చేసిన సేవలను కొనియాడుతూనే..  వ్యక్తిగతంగా ఆయన పట్ల తనకున్న గౌరవాన్ని లోకేష్ చాటుకున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు ప్రముఖులతో కలిసినప్పుడు అది కేవలం ఒక ఫోటో షూట్‌కో లేదా మర్యాదపూర్వక భేటీకో పరిమితం అవుతుంది. కానీ లోకేష్, సచిన్ విషయంలో మాత్రం వారి మధ్య ఉన్న పాత జ్ఞాపకాలు, ఉమ్మడి అభిరుచులు వారి సంభాషణలో ప్రతిబింబించాయి.

నారా లోకేష్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్న వివరాల ప్రకారం..  సచిన్‌తో గడిపిన సమయం ఆయనకు  ఎంతో స్ఫూర్తినిచ్చింది.  క్రికెట్ మైదానంలో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన సచిన్..  మైదానం వెలుపల కూడా ఎంతో నిరాడంబరంగా ఉంటారని లోకేష్ ప్రశంసించారు. కేవలం క్రీడల గురించి మాత్రమే కాకుండా, సామాజిక అంశాలు మరియు అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలు కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.

ముఖ్యంగా లోకేష్ గతంలో విదేశాల్లో చదువుకుంటున్న సమయంలోనూ, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన క్రమంలోనూ సచిన్ ఆటను చూసి ఎంతో ప్రభావితం అయ్యేవారు. ఒక రకంగా చెప్పాలంటే, సచిన్ పట్ల లోకేష్‌కు ఉన్నది ఒక అభిమానిగా చూసే గౌరవంతో పాటు, ఒక మంచి స్నేహితుడికి ఇచ్చే ప్రాధాన్యత. వీరిద్దరి మధ్య ఉన్న ఈ బాండింగ్ గత కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తోంది. సచిన్ కూడా లోకేష్ విజన్ పట్ల ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది.

గతంలో కూడా సచిన్ టెండూల్కర్ ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నప్పుడు, ఆ పనుల పర్యవేక్షణ విషయంలో అప్పటి ప్రభుత్వంతో సమన్వయం చేసుకునే క్రమంలో లోకేష్ చురుకైన పాత్ర పోషించారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య ఒక అవగాహన ఏర్పడింది. ప్రజల కోసం ఏదైనా చేయాలనే తపన ఉన్నవీరిరువురి మధ్యా  పరిచయం కాస్తా బలమైన స్నేహంగా రూపాంతరం చెందింది. ఈ స్నేహం కేవలం వ్యక్తిగతానికే పరిమితం కాకుండా.. రాష్ట్ర అభివృద్ధి, క్రీడల ప్రోత్సాహానికి ఎలా ఉపయోగపడుతుంది అనే కోణంలోనూ చర్చలు సాగుతుంటాయి.

 ప్రస్తుతం సోషల్ మీడియాలో  సచిన్, టెండూల్కర్ ల అనుబంధాన్ని చాటే ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. వీటిపై నెటిజనులు పలురకాల కామెంట్లు చేస్తున్నారు.  టూ లెజెండ్స్ ఇన్ వన్ ఫ్రేమ్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లోకేష్ తన పోస్ట్‌లో సచిన్‌ను  గాడ్ ఆఫ్ క్రికెట్  అని సంబోధిస్తూనే, ఆయన సరళతను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.   

google-ad-img
    Related Sigment News
    • Loading...