Latest News
టీమ్ ఇండియా విక్టరీని ప్రత్యక్షంగా వీక్షించిన నారా లోకేష్
posted on: Mar 8, 2026 11:23PM

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ అహ్మదాబాద్ వేదికగా ఆదివారం (మార్చి 8) అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్‌ను ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆశాంతం తిలకించారు.
టీమిండియా జెర్సీని ధరించి స్టాండ్స్‌లో కూర్చిని టీమ్ ఇండియాను ఎంకరేజ్ చేశారు. టీమ్ ఇండియా విజయాన్ని ఆస్వాదించారు. కాగా ఈ సందర్భంగా స్టేడియంలో పలువురు ప్రముఖులను కూడా నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌ను కలవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని లోకేశ్ పేర్కొన్నారు.

అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్సెలార్ మిట్టల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య మిట్టల్‌తో కూడా భేటీ అయ్యారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే వీరితో కాసేపు ముచ్చటించారు. అలాగే టీమిండియా మాజీ కెప్టెన్లు ధోనీ, రోహిత్ శర్మ, వెంకటేశ్ ప్రసాద్ లో పాటు ఐసీసీ చైర్మన్ జై షాను కూడా లోకేశ్ ఈ సందర్భంగా కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు.






