తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లు 42 నుంచి 64కి పెంచాలని ప్రతిపాదన

posted on: Jun 12, 2026 5:42PM

 

దేశంలో లోక్‌సభ సెగ్మెంట్ల డిలిమిటేషన్‌పై పీఎం ఆర్థిక సలహా మండలి కీలకమైన ప్రతిపాదనలు చేసింది. దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి ఏకంగా 824కు పెంచాలని సిఫార్సు చేసింది. గతంలో కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లు సందర్భంగా స్థానాల సంఖ్యను 815గా అంచనా వేయగా, ఆర్థిక సలహా మండలి  824 చేయాలని సూచించడం ప్రాధాన్యత సంతరించుకుంది.  ఆర్థిక సలహా మండలి  నివేదక ప్రకారం ఆర్థిక సలహా మండలి తాజా నివేదిక ప్రకారం  ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో పలు కీలక నియోజకవర్గాల రూపురేఖలు మారనున్నాయి. 

తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్ నియోజకవర్గాలను మూడేసి కొత్త నియోజకవర్గాలుగా మార్చాలని, చేవెళ్ల స్థానాన్ని రెండుగా విభజించాలని స్పష్టం చేసింది ఏపీలో రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం నియోజకవర్గాలను మూడేసి స్థానాలుగా విడగొట్టాలని, మచిలీపట్నం నియోజకవర్గాన్ని రెండుగా విభజించాలని ప్రతిపాదించింది. దాంతో ఏపీలో 25 ఎంపీ సీట్లు నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి పెరుగుతాయి. అలాగే హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్ సెగ్మెంట్లను 3గా, చేవెళ్ల స్థానాన్ని 2గా విభజించాలని సూచించింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...