వైసీపీకి పెద్ద సమస్య... నాటుకోడి మాంసం ధరలు
posted on: Feb 3, 2026 2:29PM
.webp)
పార్లమెంట్ సాక్షిగా వైసీపీ అభాసుపాలైంది. ఆంధ్రప్రదేశ్‌లో మరే ఇతర సమస్యా లేనట్లు నాటుకోడి మాంసం ధరలపై లోక్‌సభలో ప్రస్తావించి వైసీపీ ఎంపీ అవగాహన లేకుండా మాట్లాడి నవ్వులపాలయ్యాడు. పార్లమెంట్ వేదికగా నాటుకోడి మాంసం ధరల పెరుగుదలపై అవినాశ్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో నాటుకోడి మాంసం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ప్రస్తావించారు.
ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. మటన్ ధరలకంటే నాటుకోడి మాంసం ధరలు ఎక్కువగా ఉంటే, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని పార్లమెంటులో ప్రశ్నించారు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన నాటుకోడి మాంసం, ప్రస్తుతం సామాన్యులకు అందని స్థాయికి చేరిందని అవినాశ్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రశ్నకు కేంద్రప్రభుత్వం తరఫున కేంద్రమంత్రి లలన్ సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
నాటుకోడి మాంసం ధరలు మటన్ కంటే ఎక్కువగా ఉన్నాయనే ఆరోపణలను లలన్ సింగ్ పూర్తిగా ఖండించారు. మటన్ ధర రూ. 900 వరకు, నాటుకోడి మాంసం ధర సగటున రూ. 500 మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ఈ ధరల ప్రకారం.. నాటుకోడి మాంసం మటన్ కంటే తక్కువ ధరకే లభిస్తున్నట్లు లలన్ సింగ్ తెలిపారు. ఈ అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నాటుకోడి మాంసం ధరలపై పార్లమెంట్‌లో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి ప్రస్తావించడం నవ్వులపాలవుతోంది.






