జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు
posted on Jun 13, 2025 8:10PM

తెలంగాణల్లో స్ధానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ సిద్దమవుతుంది. ఈ క్రమంలోనే మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేడు మహబూబాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికలను జూలైలో నిర్వహించబోతున్నామని, ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే రిలీజ్ కానుందని తెలిపింది. ఈ ఎన్నికల్లో అన్ని పంచాయతీలను కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని, అందుకోసం పార్టీలో కొత్త, పాత నేతలు అనే భేదాభిప్రాయాలు లేకుండా అందరూ సమిష్టిగా పని చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
మరోవైపు సర్పంచ్ ఎన్నికలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గత వారం నుంచి రాష్ట్ర మంత్రులు సైతం స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై ఫోకస్ పెట్టారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్లుగానే లోకల్ బాడీ ఎన్నికల్లోనూ గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు