Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రధాని అవ్వలేకపోయాడు… రాష్ట్రపతి అక్కర్లేదంటున్నాడు!
posted on: Apr 7, 2017 5:38PM

లాల్ కృష్ణ అడ్వాణీ … ఈ పేరు ఆధునిక భారతీయ చరిత్రలో ఎవ్వరూ మరవలేనిది. ఇష్టం వున్నా, లేకున్నా అడ్వాణీని మాత్రం ఎవ్వరూ పట్టించుకోకుండా మాత్రం వుండలేరు! అంతగా ప్రభావితం చేశారు ఆయన దేశాన్ని! మరీ ముఖ్యంగా తన రథ యాత్రతో కాంగ్రెస్ , ఇతర లౌకికవాద పార్టీల పునాదులకి 1980లలోనే బీటలు పడేలా చేశారు. అదే ఇవాళ్ల అద్భుత ఫలితాలు ఇస్తోంది. మోదీ లాంటి ప్రధానిని, యోగీ లాంటి ముఖ్యమంత్రిని భారీయులకి అందించింది! కాని, అడ్వాణీ తాజా వ్యాఖ్యలు ఆయన అభిమానుల్ని, బీజేపి కార్యకర్తల్ని అందర్నీ షాక్ కి గురి చేశాయి!
వాజ్ పేయి పక్కనే వుంటూ అన్ని కార్యాలు చక్క పెట్టిన అర్జునుడు అడ్వాణీ! అర్జునుడి లాగే అధికారం వచ్చేదాకా ఎంతో శ్రమించిన ఆయన ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రధాని అభ్యర్థిగా వాజ్ పేయినే సమర్థించారు! తాను హోం, డిప్యూటి ప్రధాని పదవులకే పరిమితం అయ్యారు. ఆ తరువాత ఎన్నికల్లో బీజేపి వరుసగా రెండు సార్లు ఓడిపోవటం, మూడోసారి కల్లా మోదీ తెరపైకి రావటంతో అడ్వాణీ ప్రధాని కల నెరవేరకుండానే మిగిలిపోయింది! అందుకే, ప్రధాని అవ్వలేకపోయిన అడ్వాణీని రాష్ట్రపతిని చేసి గురు దక్షిణ చెల్లిద్దామని మోదీ భావించినట్టు ఈ మధ్య వార్తలు వచ్చాయి. కాని, తాజా న్యూస్ ప్రకారం అడ్వాణీ తనకు దేశాధ్యక్ష పదవిపై ఇంట్రస్ట్ లేదని చెప్పారట!
అడ్వాణీ రాష్ట్రపతి పదవి ఆఫర్ తిరస్కరిస్తారని ఎవ్వరూ ఊహించలేదు. కాని, ఆయన ఒక ఇంగ్లీష్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగానే రాష్ట్రపతి రేసులో తాను లేనని తే్ల్చేశారట! ఇందుకు కారణం ఏమై వుంటుంది అన్నది ఇంకా తెలియలేదు. మోదీ తనని ఓవర్ టేక్ చేసి ప్రధాని కావటం ఆయన ఇప్పటికీ జీర్ణించుకున్నట్టు లేదు. బీహార్ ఎన్నికల వైఫల్యం అప్పుడు కూడా అడ్వాణీ మోదీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఇంకా అనేక సార్లు ఆయన 2014 నుంచీ మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతూనే వస్తున్నారు. ఆయన టీమ్ గా ముద్రపడ్డ అరుణ్ శౌరీ, శత్రుఘ్న సిన్హా వగైరా వగైరా లాంటోళ్లు కూడా మోదీ మీద వీలైనప్పుడల్లా విమర్శలు చేస్తూనే వున్నారు! ఈ నేపథ్యంలోనే మోదీ ఆఫర్ చేసే రాష్ట్రపతి పదవి అడ్వాణీ స్వీకరించదలిచి వుండకపోవచ్చు!
ఇప్పటికే ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ బాగవత్ కూడా తాను మీడియాలో ప్రచారం జరిగినట్టు రాష్ట్రపతి రేస్ లో లేనని చెప్పారు. ఇప్పుడు అడ్వాణీ కూడా తప్పుకోవటంతో జూలైలో ఎవ్వరూ ఊహించని వ్యక్తి భారతదేశానికి ప్రథమ పౌరుడు అయ్యే అవకాశం కనిపిస్తోంది!



.jpg)


