అయ్య బాబోయ్ ఇన్ని మద్యం బాటిల్స్

 

మందుబాబులకు మన సరుకు కంటే విదేశీ సరుకు మీద మక్కువ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఆ సరుకు తక్కువ దొరుకు దొరుకుతుంటే... ఇక ఊరుకుంటారా... కొందరైతే దాన్నే వ్యాపారంగా సాగి స్తున్నారు. కొంతమంది వివిధ మార్గాల ద్వారా ఇతర రాష్ట్రాల నుండి గుట్టు చప్పుడు కాకుండా  మద్యం బాటిల్స్ లను హైదరాబాద్‌కు రవాణా చేసి యదేచ్ఛగా అమ్మకాలు జరుపుతున్నారు. 

ఈ క్రమంలోనే రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ టీం కు గోవా, ఢిల్లీ, పాండిచ్చేరి ప్రాంతాల నుండి మద్యం తీసుకువచ్చి తెలంగాణలో అమ్మకాలు జరిపేందుకు ప్రయత్నం చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు ఎన్ఫోర్స్మెంట్ టీం షరీఫ్ పహాడ్ వద్ద వాహనాలు తనిఖీలు చేపట్టారు.. ఈ తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా కనిపించిన కార్లను తనిఖీ చేశారు. 

నిబంధనలకు విరుద్ధంగా ఓ 20 మంది వద్ద అత్యధికంగా మద్యం బాటిల్స్ ఉండడం గమనించారు. దీంతో ఎన్ఫోర్స్మెంట్ టీం వారందరికీ నోటీసులు ఇచ్చి పంపించారు. అనంతరం వారి వద్ద ఉన్న 192 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసు కున్నట్లుగా ఏఈ ఎస్ జీవన్ కిరణ్ తెలిపారు. పట్టుకున్న మద్యం విలువ 5.76 లక్షల విలువ ఉంటుందని తెలిపారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu