అల్లాదుర్గంలో చిరుత సంచారం.. భయాందోళనల్లో జనం

posted on: Feb 10, 2026 8:41AM

తెలుగు రాష్ట్రాలలో వన్యప్రాణుల సంచారం బెంబేలెత్తిస్తోంది. పులులు, చిరుతలు ఆహారం కోసం జనావాసాలకు రావడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగు రాష్ట్రాలలో పెద్దపులుల సంచారం గురించిన వార్తలు భయం గొలుపుతుంటే.. తాజాగా మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. 

చిరుత సంచారం మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల ప్రజలను భయాందోళనల్లో ముంచేసింది.   అకోలా, హైదరాబాద్  జాతీయ రహదారి పక్కన ఉన్న అల్లాదుర్గం మండలం ఐబీ చౌరస్తా సమీపంలో సోమవారం రాత్రి చిరుత సంచారాన్ని స్థానికులు గుర్తించారు.

ఈ చిరుత సర్వీసు రోడ్డుపై సంచరిస్తుండటాన్ని గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.  వెంటనే అప్రమత్తమైన అధికారులు గొల్లకుంట తండా, గాండ్లబాయి తండా, మాందాపూర్, చిల్వేర్ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  హెచ్చరించారు. చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...