Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అమరావతికి చట్టబద్ధత.. ఢిల్లీలో చక్రం తిప్పిన నారా లోకేష్
posted on: Apr 13, 2026 9:14AM
.webp)
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించి, గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త ఉత్సాహానికి కారణమైంది. ముఖ్యంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి కేంద్రం నిర్ణయం వేయి ఏనుగుల బలాన్నిచ్చింది. ఇక అమరావతి అభివృద్ధి వాయువేగంతో సాగుతుందన్న నమ్మకాన్ని ప్రజలకు ఇచ్చింది. అయితే కేంద్రం ఇంత వేగంగా ఈ నిర్ణయం తీసుకోవడం, పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఇందుకు సంబంధిచిన బిల్లు ఆమోదం పొందడం, ఆ వెంటనే రాష్ట్రపతి సంతకం, గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఎలాంటి జాప్యం లేకుండా సాగిపోవడం వెనుక ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఆ విషయంలో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో కీలక చర్చ జరుుగుతోంది.
గతంలో ఢిల్లీ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పేవారు. ఇప్పుడు ఆ కీలక భూమిక లోకేష్ పోషిస్తున్నారన్నది రాజకీయవర్గాలలో టాక్. అమరావతికి సంబంధించిన కీలక అనుమతులు సాధించడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారనీ, ఢిల్లీ వేదికగా ఎన్డీయే కూటమిలోని కీలక నేతలను, ఎంపీలను సమన్వయం చేస్తూ అమరావతి ఆవశ్యకతను వివరించడంలో లోకేష్ సక్సెస్ అయ్యారనీ అంటున్నారు. పార్లమెంటు సమావేశాల సమయంలోనూ అక్కడే ఉండి ఎప్పటికప్పుడు పరిణామాలను గమనిస్తూ అమరావతికి రాష్ట్ర ఏకైక రాజధానిగా చట్టబద్ధ గుర్తింపు లభించేలా చేశారనని చెబుతున్నారు.
అమరావతికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన అనంతరం, లోకేష్ మరోసారి ఢిల్లీకి చేరుకున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పర్యటన లోకేష్ రాజకీయ పరిణతికి అద్దం పడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలనపై దృష్టి సారిస్తుండగా, జాతీయ స్థాయిలో పార్టీ గళాన్ని వినిపించడం, రాష్ట్రప్రయోజనాల సాధనకు కృషి చేయడం వంటి బాధ్యతను లోకేష్ భుజాన వేసుకున్నారని అంటున్నారు.
రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణతో పాటు, కేంద్రం నుంచి రావాల్సిన సహాయ సహకారాల విషయంలోనూ లోకేష్ వరుసగా జాతీయ నాయకులను కలుస్తున్నారు. తండ్రి నారా చంద్రబాబు రాజకీయ వారసత్వాని అందిపుచ్చుకుంటూనే.. అదే సమయంలో రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధిస్తున్నారని చెబుతున్నారు. లోకేష్ చొరవతో అమరావతికి మార్గం సుగమం కావడమే కాకుండా, భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధికి మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఎన్డీయే వర్గాలే అంటున్నాయి.






