లెబ్రాన్ జేమ్స్.. బాస్కెట్ బాల్ లో ప్రపంచ రికార్డుకు ఒక్క మ్యాచ్ దూరంలో!

posted on: Mar 21, 2026 10:46AM

బాస్కెట్ బాల్ గురించి ఏ మాత్రం పరిచయం ఉన్నా లెబ్రాన్ జేమ్స్ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంతలా ఆ ఆటలో నిష్ణాతుడై రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న దిగ్గజ ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్. ఇప్పుడు మరో అరుదైన వరల్డ్ రికార్డుకు కేవలం ఒక్కటంటే ఒక్క మ్యాచ్ దూరంలో నిలిచాడు.  ప్రపంచవ్యాప్తంగా  నేషనల్ బ్యాస్కెట్ బాల్ అసోసియేషన్ కు ఉన్న ఆదరణ సామాన్యమైనది కాదు.  

ఆ అసోసియేషన్ చరిత్రలోనే  అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రీడాకారుడిగా లెబ్రాన్  సరికొత్త రికార్డును తన పేర లిఖించుకోవడానికి కేవలం ఒక్క మ్యాచ్ దూరంలో ఉన్నాడు. ఆ రికార్డు సృష్ఠించే మ్చాచ్ ను లెబ్రాన్ జేమ్స్ ఆదివారం (మార్చి 22)న ఆడనున్నాడు. ప్రస్తుతం లెబ్రాన్ వయస్సు 41 ఏళ్లు. మామూలుగా అయితే ఆ వయస్సు రిటైర్ మెంట్ వయస్సును దాటిపోయింది. కానీ లెబ్రాన్ జేమ్స్ మాత్రం ఈ వయస్సులోనూ యువ ప్లేయర్స్ కు దీటుగా రాణిస్తున్నాడు.   

ప్రస్తుత  ఎన్‌బీఏ సీజన్‌లో భాగంగా మయామి హీట్ జట్టుతో జరిగిన పోరులో లెబ్రాన్ జేమ్స్ బరిలోకి దిగారు. ఈ మ్యాచ్‌తో ఆయన తన కెరీర్‌లో మొత్తం 1611 మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నారు. దీంతో  1997 నుంచి రాబర్ట్ పారిష్ పేరిట ఉన్న  అత్యధిక మ్యాచ్‌ల రికార్డును లెబ్రాన్ సమం చేశాడు. ఆ మ్యాచ్ లో లెబ్రాన్ తన వ్యక్తిగత ఖాతాలో 19 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఆదివారం (మర్చి22) ఒర్లాండో మ్యాజిక్ జట్టుతో జరిగే మ్యాచ్‌తో కొత్త రికార్డు సృష్టించనున్నాడు.  

ఎన్‌బీఏలో లెబ్రాన్ జేమ్స్  రికార్డులకు కొదవేలేదు.  వరుసగా 23 సీజన్లు ఆడిన ప్లేయర్గా, లీగ్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత పాయింట్లు సాధించిన ఆటగాడిగా రికార్డులు లెబ్రాన్ జేమ్స్ పేరునే ఉన్నాయి.  ఇప్పుడు మోస్ట్ క్యాప్డ్ ప్లేయర్  రికార్డును సైతం తన ఖాతాలో వేసుకోనున్నాడు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...