బద్దకం వీడండి

చింతిస్తూ కూర్చోకుండా చింత కలిగించే విషయాలను చీపురుతో చితక్కొడదాం. అయితే ఆ చింతింప జేసే విషయాలు ఏంటో చూద్దాం. 

మొదటిది 1.బద్ధకం, సోమరితనం, అలసత్వం... పేర్లు వేరైనా భావం ఒక్కటే. ఇదే నన్ను, నిన్ను, సమాజాన్ని, దేశాన్ని పట్టి పీడిస్తున్న రోగం. ఇదే ఎక్కువ బాధ పెడుతున్న విషయం. జపాన్ చాలా చిన్న దేశం అయినా మనకన్నా ఏంతో ఎత్తులో ఉంది. భూకంపాలు అగ్నిపర్వతాలు సునామీలు ప్రతినిత్యం పలకరిస్తున్నా అగని పోరాటం వాళ్ళది. మనం మాత్రం పనికి రాని బిగ్ బాస్ లు, కుల్లిజోకుల జబర్దస్త్ లు చూసుకుంటూ గడిపెద్ధాం. 
 రెండవది 2. ప్రశ్నించే దైర్యం లేక పోవడం. పక్కవాడికి అన్యాయం జరిగితే నాకేంటి నేను నా కుటుంబం బాగుంది కదా అనే భావం మన నరనరాల్లో కూరుకు పోయింది.

 మూడవది 3. ఐక్యత లేక పోవడం. ముసల్మానుల కాలం నుండి తెల్లదొరల కాలం వరకు మనలోని లోపం అదే.

 నాలుగవది. 4. శుభ్రత లేకపోవడం. నదులు శుభ్రంగా ఉంచలేం(జపాన్ లోని మురికి కాలువ మన యమునా నది కన్నా 10రెట్లు స్వచ్చంగా ఉంటుంది) పరిసరాలు శుభ్రంగా ఉంచలేము. మనకెందుకు ghmc వాళ్ళు వచ్చి శుభ్రం చేస్తారుగా అంటారా? పోని వాళ్ళకి ఫిర్యాదు చేశారా?? రోడ్ల మీద ఉమ్మి , చెత్త, యూరిన్ వెయ్యకుండా ఎంతమంది ఉన్నారు? ఇక వ్యవస్థను శుభ్రంగా కూడా ఉంచలెం. ఏ నాయకుడు నిజం నవాబులా వ్యవహరిస్తున్నాడో అతనికే మళ్లీ పట్టం కడతాం. ఎవడైతే కోట్ల రూపాయల అవినీతి చేస్తాడో అతన్ని నాయకుడిని చేస్తాం. విద్య, వైద్య, వివాహ... ఇలా ఎన్నో వ్యవస్థలను భ్రష్టు పట్టించాం 
5. కుల మత వర్గ వర్ణ వివక్ష... ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇన్ని కులాలు, వర్ణాలు ఉండవు. మనం అంతా మనుషులమే అని మరిచి మనలో మనం కొట్టుకుచస్తా ఉంటాం. అరే వాడు మన కులపొడురా వాడికే మన ఓటు అంటాం గాని, మన బతుకులు బాగు చేసే వాడురా వాడికి ఓటు వేద్దాం అని చాలా మంది ఆలోచించం. 

వీటన్నింటిలో ముఖ్యంగా ఆలోచించాల్సింది సోమరితనం గురించి.

సోమరితనం రాచపుండు అని గాంధీజీ అన్నట్టు, సోమరి పోతు దేశానికే భారం. 
మన భారత దేశంలో మనమే మన జాతీయ సంపద. ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన రెండవ అతిపెద్ద దేశం. అయినా ఇంకా వెనుక బడిన దేశం. ఉద్యోగాలు లేవు లేవు అని గగ్గోలు పెడతాం, కానీ ఆలోచిస్తే ఎన్ని ఉపాధి అవకాశాలు కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెట్టీ , టీవీలు కంప్యూటర్లు సినిమాలు చూస్తూ మన విలువైన జీవితాన్ని ఏం సాధించకుండా సమాధి కట్టెద్ధాం. ఏముందీ..పుట్టాం..పెరిగాం...చదివాం...ఏదో బొడి ఉద్యోగం తెచ్చుకున్నాం, పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాం, వాళ్ళ బాగోగులు చూసాం, వాళ్ళ పెళ్లి చేశాం..ముసలి అయ్యం..ఇంకేం ఉంది...కృష్ణా రామా అనుకుంటూ గడిపెద్ధాం...ఇంతేనా చరిత్రలో మనకో పేజీ ఉందొడ్డూ?? 

KFC owner 60 ఏళ్ల వయసులో KFC స్థాపించారు. అది చదవడం వరకే అలాంటివి చెయ్యడానికి మనం పునుకోము . ఒక లక్ష్యం నిర్దేశించుకుని ముందడుగు వెయ్యము. అంతేగా ఈ జీవితం

◆వెంకటేష్ పువ్వాడ