Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గంభీర్ కు లక్ష్మణ రేఖ.!
posted on: Jul 28, 2026 3:55PM

ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో టి20 సిరీస్ లలో వరుస ఓటముల్లో కుదేలైన టీమ్ ఇండియా .. జింబాబ్వే తో జరిగిన మూడు టి20ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి కొత్త జవసత్వాలను అందిపుచ్చుకుంది. ఈ సిరీస్ లో సానుకూలాంశమేంటంటే.. హెడ్ కోచ్ వివిఎస్ లక్ష్మణ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ల మార్గదర్శకత్వంలో యంగ్ టీమ్ మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్. సీనియర్లు విశ్రాంతి తీసుకున్నా ఈ సిరీస్ ను యంగ్ ప్లేయర్లను ముందుండి నడిపించడంలో కోచ్, స్కిప్పర్లు ఘన విజయం సాధించడం విశేషం.
జింబాబ్వేపై 3-0తో సాధించిన క్లీన్ స్వీప్ భారత క్రికెట్ అభిమానుల్లో కొత్త జోష్ నింపింది. అశోక్ శర్మ, యశ్ ఠాకూర్ లాంటి డెబ్యూటెంట్లలో కాన్ఫిడెన్స్ నింపి, వారి నుంచి అద్భుత ప్రదర్శన రాబట్టిన వెరీ వెరీ స్పెషల్ వీవీవీఎస్ లక్ష్మణ్ ప్రశాంతత, విజన్ క్రికెట్ అభిమానుల మనస్సులను హత్తుకుంది.
దీంతో ప్లేయర్లపై దురుసుగా వ్యవహరిస్తూ, ఇష్టారీతిగా టీమ్ కాంబినేషన్ ను మార్చేస్తూ వారి ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా వ్యవహరించే గౌతం గంభీర్ కు ఇక విశ్రాంతి ఇస్తే మేలన్న చర్చ ఇటు క్రికెట్ అభిమానుల్లోనూ, అటు నెటిజన్లలోనూ జోరుగా సాగుతోంది.
జింబాబ్వే తో టి20 సిరీస్ ను రెగ్యులర్ కోచ్ గౌతం గంభీర్ విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు ఐర్లండ్, ఇంగ్లాండ్ లతో వరుసగా రెండు టి20 సిరీస్ లలో పరాజయం పాలైన టీమ్ ఇండియాకు హెడ్ కోచ్ గా పని చేసిన గంభీర్ వ్యవహార శైలి కారణంగానే ఆ ఓటములు ఎదురయ్యాయని క్రికట్ అభిమానులు అంటున్నారు. వివిఎస్ లక్ష్మణ్ మార్గదర్శకత్వంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నయా డెబ్యూటెంట్లు అశోక్ శర్మ, యశ్ ఠాకూర్‌లు మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మన్స్ లు ఇచ్చారు. ఇంగ్లాడ్ టూర్ వైఫల్యాల తర్వాత లభించిన ఈ బిగ్ విక్టరీతో గౌతమ్ గంభీర్ కు ఉద్వాసన పలికి, వీవీఎస్ లక్ష్మణ్ ను పర్మనెంట్ హెడ్ కోచ్‌గా నియమించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
ఒక విధంగా జింబాబ్వే టూర్ తో గౌతం గంభీర్ కు లక్షణ రేఖ గీసినట్లేనని క్రీడా పండితులు సైతం విశ్లేషిస్తున్నారు. సీనయర్ ప్లేయర్లతో గౌతం గంభీర్ కు ఉన్న విభేదాలు, ఆయన వ్యవహార శైలి యువ క్రికెటర్లలో కాన్ఫిడెన్స్ ను దెబ్బతీసేలా ఉన్నాయనీ, టీమ్ ఇండియా విజయపరంపర కొనసాగాలంటే గంభీర్ కు ఉద్వాసన పలకడమే మేలని అంటున్నారు.
VVSLaxman, autamGambhir, TeamIndia, ZIMvIND, CricketNews, TeluguOne






