న్యాయవాది స్వప్న మర్డర్ కేసులో ట్విస్ట్
posted on: Feb 14, 2026 5:05PM

న్యాయవాది స్వప్న మర్డర్ కేసులో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.. ఓ స్వంత అన్న చెల్లెల్ని అతి దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలి సిందే... ఈ కేసులో ఇప్పటికే పోలీసులు అన్న రాజుతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలిం చారు. అయితే ఈ కేసులో ఇప్పుడు తాజాగా మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.. రాజు, స్వప్న అన్నా చెల్లెలు... తల్లిదండ్రులు స్వప్నకు మరియు రాజుకు ఆస్తి పంపకాలు చేశారు.
అయితే తన చెల్లికి ఆస్తి ఇవ్వడం అన్న రాజుకు ఇష్టం లేదు... దీంతో చెల్లి స్వప్నను అడ్డు తొలగించుకుంటే ఆస్తి మొత్తం తనకు దక్కుతుం దని భావించిన అన్న రాజు వెంటనే తన స్నేహితుల సహాయం కోరాడు. అందుకు వీరేష్, శివ, శేఖర్ అనే ఈ ముగ్గురు స్నేహితులు అంగీకరించారు. శేఖర్ తన స్నేహితుడు చెల్లి స్వప్న కదలికలను గమనిస్తూ లొకేషన్ వివరాలు ఎప్పటి కప్పుడు రాజుకు చేరవేసే వాడు.. ఇలా స్వప్న వివ రాలు తెలుసుకున్న రాజు గతంలో రెండు సార్లు స్వప్నను హత్య చేసేందుకు ప్రయత్నించాడు.
అన్న రాజు ఒకసారి కారుతో మరోసారి బుల్డోజర్ తో స్వప్నను ఢీకొట్టే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు.. అయితే చెల్లిని హత్య చేయాలనుకున్న అన్న రాజు హత్య చేసిన అనంతరం దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు పథకం వేశాడు. ఈ పథకంలో భాగంగానే సిసి కెమెరాలు లేని ప్రదేశాలను చూసి స్వప్నను వెనక నుండి ఢీకొట్టేందుకు ప్లాన్ చేసుకు న్నాడు... అందుకే రెండు సార్లు స్వప్నను హత్య చేసేం దుకు ప్రయత్నించాడు. కానీ రెండు సార్లు విఫలమ య్యాడు... ఆ సమయంలో స్వప్న అప్రమత్తంగా ఉండ డంతో ప్రాణాపాయం నుండి బయటపడింది..
అయితే మూడోసారి స్వప్న తన తల్లిదండ్రులు ఇచ్చిన స్థలం వద్దకు వెళ్తున్న సమయంలో పక్కా ప్లాన్ తో అన్న రాజు తన వాహనంతో అత్యంత వేగంగా వెళ్లి స్వప్న వాహ నాన్ని ఢీ కొట్టి చంపేశాడు. అనంతరం స్వప్న మరణం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిం చాడు. మొదటిగా పోలీ సులు రోడ్డు ప్రమాదంగా భావించి... కేసు నమోదు చేసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించడంతో అసలు విషయం వెలుగు లోకి వచ్చింది. దీంతో పోలీసులు అన్న రాజుతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేయడంతో స్వప్నను హత్య చేసినట్లుగా రాజు ఒప్పుకున్నాడు.
అంతేకాకుండా గతంలో రెండు సార్లు స్వప్నను హత్య చేయడానికి ప్రయత్నించినట్లు కూడా రాజు విచారణలో వెల్లడిం చాడు. తన ప్లాన్ విజయ వంతం కావడానికి తన స్నేహితులు వీరేష్, శివ, శేఖర్ ల సహాయం తీసు కున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది దీంతో పోలీసులు స్వప్న లొకేషన్ వివరాలు ఎప్పటి కప్పుడు రాజుకు చేరవేసిన శేఖర్ అనే మరో వ్యక్తిని కూడా అరెస్టు చేశారు... రోడ్డు ప్రమాదం కేసును ఇప్పుడు పోలీసులు హత్యాయత్నం కేసుగా మార్చేందుకు సిద్ధమవుతు న్నారు... కేసు దర్యాప్తు వేగవంతం చేసి మరిన్ని వివరాల సేకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.






