Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నమో నారా భేటీలో నవ్వుల సందడి
posted on: May 11, 2026 9:13AM

ఒకరు దేశానికి ప్రధాన మంత్రి.. మరొకరు సీనియర్ ముఖ్యమంత్రి.. ఇద్దరూ రాజకీయాల్లో మేరు నగధీరులు... గంభీరంగా ఉంటారు. నిత్యం అభివృద్ధి-సంక్షేమం, దేశం-రాష్ట్రం గురించే వీరి ఆలోచన, తపన. క్షణం తీరికలేని పర్యటనల్లో ఉంటారు. తొలిసారిగా వీరిద్దరూ మధ్య సరదా సంభాషణలతో సమావేశం జరిగింది. హైదరాబాద్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ఇంటికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ గంటకుపైగా సమయాన్ని చంద్రబాబు నివాసంలో గడిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మధ్య సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఆసాంతం నవ్వులు విరిశాయి. సీఎం చంద్రబాబు నివాసంలోకి అడుగు పెడుతుండగానే... ఓ ఫొటో చూసిన ప్రధాని ఏడాది క్రితం అనుభాలను గుర్తు చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సరిగ్గా ఏడాది క్రితం యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ ఢిల్లీలో చేయించారు మంత్రి నారా లోకేష్. అప్పటి ఫోటోను ఫ్రేమ్ చేయించి.. అందులో యువగళం కాఫీ టేబుల్ బుక్ కూడా భద్రపరిచారు. ఇది సీఎం చంద్రబాబు ఇంట్లోకి వెళ్లే ముందు కనిపిస్తుంది. ప్రధాని మోదీ ఆ ఫొటోను చూసి నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ఈ పుస్తకాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించి ఏడాది పూర్తైందనీ, యాధృచ్చికంగా ప్రధాని తమ ఇంటికి వచ్చారంటూ ప్రధాని మోదీకి నాటి సంఘనటలను లోకేష్ గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబు ఇంటిలోని రామమందిరం వద్ద పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల విగ్రహాలు దశాబ్దాల నాటివని... ఆ పంచలోహ విగ్రహాలను నందమూరి తారకరామారావు గారు తమకు ఇచ్చారని సీఎం చంద్రబాబు ప్రధాని మోదీకి వివరించారు.
చంద్రబాబు నివాసంలో ప్రధానితో సమావేశం సందర్భంగా రాష్ట్రాభివృద్ధికి కేంద్రం, ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న సాయానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ సమావేశంలో లోకేష్ ఫిట్నెస్ పై ఆసక్తికర సంభాషణ జరిగింది. లోకేష్ ఇలా స్లిమ్‌గా, ఫిట్‌గా మారడానికి ప్రధాని మోదీనే కారణమని ముఖ్యమంత్రి తెలిపారు. తొలిసారి ప్రధానితో భేటీ అనంతరం లోకేష్ ఫిట్నెస్, డైట్ పై శ్రద్ధ పెట్టారని సీఎం చంద్రబాబు ప్రధానికి చెప్పారు. లోకేష్ ఇంక బరువు తగ్గొద్దంటూ మోదీ సలహా ఇచ్చారు. ఫిట్నెస్ విషయంలో మీరే స్ఫూర్తి అని... మరింత ఫిట్ గా మారతానని లోకేష్ ప్రధానితో చెప్పారు. దేశం కోసం క్షణం తీరికలేకుండా పనిచేస్తున్నారని, 75 ఏళ్ల వయస్సులో ప్రధాని పాటించే ఆరోగ్య సుత్రాలు, శారీరక ధృడత్వం వంటివి తనకు స్ఫూర్తి అని మంత్రి లోకేష్ ప్రధానితో చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ పని విధానం చూస్తుంటే... పాతికేళ్ల వయస్సున్న ముగ్గురు యువకులు ప్రధానిలో ఉన్నట్టు చురుగ్గా పని చేస్తారని ఈ సందర్భంగా లోకేష్ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు ఇద్దరూ తనకు మెంటార్లే ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ చెప్పారు. రాజకీయాల్లోనూ, అభివృద్ధిలోనూ, ప్రజా సంక్షేమంలోనూ దేశంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు తనకు మార్గదర్శకులని... ఇద్దరూ తనకు మెంటార్లేనని, గురువులుగా వారిని అనుసరిస్తానని లోకేష్ అన్నారు. అంకితభావంతో, సేవా ధృక్ఫధంతో భావితరాల కోసం నిస్వార్థంగా పని చేసే మోదీ, చంద్రబాబుల స్పీడ్ అందుకోవాలనే తన కల సాకారం కావాలని కోరుకుంటున్నాన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ఎప్పుడు కలిసినా తన నియోజకవర్గం మంగళగిరి చేనేత శాలువాతో సత్కరించడం నారా లోకేష్ ఆనవాయితీగా పెట్టుకున్నారు. మంగళగిరి చేనేత శాలువాతో ప్రధానిని సత్కరించి లోకేష్.. మంగళగిరి చేనేత విశిష్టతను ప్రధానికి వివరించారు.






