Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. మహిళా స్మగ్లర్ అరెస్ట్
posted on: Apr 17, 2026 10:52AM
.webp)
హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్స్ స్మగ్లింగ్ ఆందోళనకర స్థాయికి చేరింది. తరచూ ఈ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా మరోసారి డ్రగ్స్ స్మగ్లింగ్ ప్రయత్నాలను కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. శుక్రవారం (ఏప్రిల్ 17) ఉదయం విమానాశ్రయంలో నిర్వహించిన తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ సందర్భంగా ఒక మహిళా స్మగ్లర్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
బ్యాంకాక్ నుంచి థాయ్ ఎయిర్‌వేస్ విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలు శంషాబాద్ చేరుకుంది. విమానాశ్రయంలో ఆమె కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు ఆ తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఆమె వెంట ఉన్న లగేజీ బ్యాగులలో రహస్యంగా దాచిన డ్రగ్స్ బయటపడ్డాయి. ప్రాథమిక పరీక్షలలో ఆమె వద్ద అభించినది హైడ్రోపోనిక్ గంజాయి అని తేలింది.
ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ అంతర్జాతీయ మార్కెట్ లో కోట్లలో ఉంటుందని అధికారులు వెల్లడించారు. నిందితురాలిని విచారణ నిమిత్తం రహస్య ప్రాంతానికి తరలించారు. ఇటీవలి కాలంలో బ్యాంకాక్, దుబాయ్ వంటి నగరాల నుండి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా పెరిగినట్లు నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో తనిఖీలను మరింత కఠినతరం చేశారు.






