Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరి అరెస్టు
posted on: Mar 31, 2026 12:59PM
.webp)
డ్రగ్స్ స్మగ్లింగ్ కు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అడ్డాగా మారిందా అంటే ఔననాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ విమానాశ్రయంలో తరచూ గంజాయి సహా మాదక ద్రవ్యాలు తరచూ పట్టుబడటంతో సర్వత్రా ఈ అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తాజాగా మంగళవారం శంషాబాద్ విమానాశ్రయంలో దాదాపు పాతిక కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో వారిని, వారి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో వారు డ్రగ్స్ తీసుకువస్తున్నట్లు వెలుగులోనికి వచ్చింది. వారి నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ దాదాపు పాతిక కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ఆ ఇద్దరినీ అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు.






