శ్రీశైలం ఘాట్ లోవిరిగిపడిన కొండ చరియలు!
posted on Nov 5, 2025 9:21AM
.webp)
శ్రీశైలం పాతాళగంగలో రోప్ వే వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. అయితే ఆ సమయంలో అక్కడ భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇటీవలి కాలంలో ఎడతెరిపి లేకుండా కురినిస భారీ వ ర్షాల కారణంగా ఇక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి.
ఈ కారణంగా ఆ దారిలో వచ్చే భక్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా బుధవారం (నవంబర్ 5) తెల్లవారు జామున ఈ మార్గం గుండా హైదరాబాద్ వెళ్లే రహదారిపై లింగాలగట్టు వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. అసలే కార్తీక మాసం, అందులోనూ కార్తీకపౌర్ణమి కావడంతో శ్రీశైలం క్షేత్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కొండ చరియలు విరిగిపడిన ఘటన తెల్లవారు జామున జరగడంతో పెను ప్రమాదం తప్పిందనీ, అదే కొద్ది సమయం తరువాత ఈ ఘటన జరిగి ఉంటే.. ఊహించడానికే భయం వేసేంత విపత్తు సంభవించి ఉండేదని స్థానికులు అంటున్నారు. ప్రస్తుతం ఆ మార్గం గుండా రాకపోకలను నిలిపివేసి, కొండ చరియలు తొలగిస్తున్నారు.