Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...లడఖ్ లో కంపించిన భూమి.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.5.!
posted on: Aug 13, 2026 10:49AM

లడఖ్ లో గురువారం (ఆగస్టు 13) ఉదయం భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.5గా నమోదైంది. ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఒక్క సారిగా భూమి కంపించడంతో జనం భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ఆస్తి, ప్రాణ నష్టంకు సంబంధించిన సమాచారమేదీ లేదు.
నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎస్సీఎస్) అందించిన వివరాల ప్రకారం.. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం భూ ఉపరితలానికి దాదాపు 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉంది. భూమి అంతర్భాగంలో 10 కిలోమీటర్ల స్వల్ప లోతులోనే ఈ ప్రకంపనలు ఉద్భవించడంతో ఉపరితలంపై తీవ్రత ఒకింత ఎక్కువగా ఉంది.
భూకంపం సంభవించిన వెంటనే స్థానిక పరిపాలనా యంత్రాంగం మరియు విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తమై ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించాయి.ఈ భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు ధృవీకరించారు. పర్వత ప్రాంతమైన లడఖ్ భూకంప సీస్మిక్ జోన్ పరిధిలో ఉండటంతో అధికారులు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
Ladakh Earthquake, Earth Tremors, Richter Scale 5.5, National Center for Seismology, NCS Earthquakes



(1).webp)


