Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేవీపీ సవాల్.. పవన్ స్పందనేంటి? జగన్ సైలెన్స్ కి కారణమేంటి?
posted on: Jun 5, 2026 11:15AM
.webp)
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీపై కానీ, జగన్ పై కానీ, వైఎస్ రాజశేఖరరెడ్డిపై కానీ విమర్శలు చేస్తే.. వైసీపీ అధినేత, వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ రియాక్ట్ కావాలి. కానీ అదేంటో.. వైఎస్ బతికి ఉన్న సమయంలో ఆయన ఆత్మగా గుర్తింపు పొందిన కేవీపీ రామచంద్రరావు రియాక్ట్ అయ్యారు. తాజాగా పవన్ కల్యాణ్ గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనను తీవ్రంగా వేధించారని, తనపై అక్రమ కేసులు పెట్టాలంటూ అప్పట్లో ఒక ఐపీఎస్ అధికారికి స్వయంగా పురమాయించారంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఈ వ్యాఖ్యలు పాత జ్ఞాపకాలను, నాటి రాజకీయ గొడవలను మరోసారి తెరపైకి తెచ్చాయి. పవన్ కళ్యాణ్ చేసిన ఈ సంచలన ఆరోపణలపై వైఎస్ ఆత్మగా చెప్పుకునే కేవీపీ రామచంద్రరావు సీరియస్ గా రియాక్టయ్యారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు. కేవీపీ విసిరిన ఈ 10 కోట్ల రూపాయల ఛాలెంజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో, పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని భుజాన వేసుకుని ఒక సారి ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత, వైఎస్ కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై ఎందుకు మౌనంగా ఉన్నారంటూ కేవీపీ ప్రశ్నించారు. వైఎస్ ప్రతిష్టను దెబ్బతీసేలా తీవ్రమైన ఆరోపణలు చేస్తుంటే.. కొడుకుగా జగన్ కి కోపం, రోషం రావాలి, కానీ, ఆయనకు అలాంటివేవీ ఎందుకు రావడం లేదని ఫైర్ అయ్యారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఆ ఐదేళ్ల కాలంలో ప్రభుత్వంలో కానీ, కాంగ్రెస్ పార్టీలో కానీ ప్రతి చిన్న అంశం కేవీపీ రామచంద్రరావు కనుసన్నల్లోనే జరిగేది. వైఎస్ ఏ నిర్ణయం తీసుకున్నా.. ఎవరికి ఏ ఆదేశాలు ఇచ్చినా అందులో కేవీపీ భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండేది. పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఒక ఐపీఎస్ అధికారిని పిలిచి వేధించమనే ఆదేశాలు వైఎస్సార్ ఇచ్చి ఉంటే.. ఆ విషయం కేవీపీ రామచంద్రరావుకు తెలియకుండా జరిగే ఛాన్సే లేదు. ఆ పూర్తి నమ్మకంతోనే, తన మిత్రుడి క్యారెక్టర్ ఏంటో తనకు పూర్తిగా తెలుసు కాబట్టే, కేవీపీ అంత గట్టిగా, అంతటి భారీ మొత్తాన్ని పణంగా పెట్టి పవన్‌కు సవాల్ విసిరారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సవాల్‌పై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.






