కుప్పం మునిసిపాలిటీ తెలుగుదేశం ఖాతాలోకి
posted on Apr 28, 2025 2:26PM
.webp)
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం. గత ఆ నియోజకవర్గ కేంద్రం అయిన కుప్పం మునిసిపాలిటీ మాత్రం గత ఐదేళ్లుగా వైసీపీ చేతిలో ఉంది. కుప్పం మునిసిపల్ చైర్మన్ గా వైసీపీ నేత డాక్టర్ సుధీర్ రెడ్డి ఉండేవారు. అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత సుధీర్ రెడ్డి తన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో అప్పటి నుంచీ కుప్పం మునిసిపల్ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. రాజీనామా చేసిన సుధీర్ రెడ్డి తెలుగుదేశం గూటికి చేరారు. నియోజకవర్గం లో గత ఐదేళ్లుగా మున్సిపల్ ఛైర్మన్ కుర్చీ వైసీపీ పరిధిలో ఉండేది. కూటమి ప్రభుత్వం ఏర్పాడిన తరువాత మాజీ ఛైర్మన్ డాక్టర్ సుధీర్ రెడ్డి కౌన్సిల్ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వైసీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
దీంతో ఖాళీగా ఉన్నకుప్పం మునిసిపల్ చైర్మన్ పదవికి సోమవారం ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో అనూహ్యంగా తెలుగుదేశం విజయం సాధించి చైర్మన్ గిరీని సొంతం చేసుకుంది. మునిసిపల్ మేయర్ పదవికి జరిగిన ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి, తెలుగుదేశం కౌన్సిలర్ సెల్వరాజ్ విజయం సాధంచారు. వాస్తవానికి కుప్పం చైర్మన్ పదవి దక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ సాధించడానికి అవసరమైన బలం వైసీపీకి ఉంది. దీంతో అంతా వైసీపీ విజయం సాధించడం ఖాయమనే భావించారు. అయితే అనూహ్యంగా వైసీపీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు తెలుగుదేశంకు మద్దతు ఇచ్చారు. దీంతో తెలుగుదేశం బలం 15కు పెరిగింది. తెలుగుదేశం అభ్యర్థి సెల్వరాజ్ విజయం సాధించారు.