పబ్‌లో డీసీపీ అకస్మిక తనిఖీలు...9 మంది అరెస్ట్

posted on: Jun 7, 2026 12:29PM

 

కూకట్‌పల్లి మంజీరా మాల్‌లోని కింగ్ & క్వీన్స్ పబ్ రాత్రి సాధారణంగా హడావుడిగా ఉండే ప్రదేశమే. కానీ ఈసారి అక్కడ జరిగిన సీన్ మాత్రం పూర్తిగా సినిమా స్టైల్‌లో మారిపోయింది. ఈరోజు తెల్లవారుజామున అనుకోకుండా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా డీసీపీ రితిరాజ్ తో పాటు పోలీస్ టీమ్ పబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బయటకు ప్రశాంతంగా కనిపించిన పబ్ లోపల అడుగు పెట్టగానే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. డాన్స్ ఫ్లోర్‌లో లైట్లు, మ్యూజిక్, హై వాల్యూమ్ బీట్‌లతో యూత్ మొత్తం మునిగిపోయిన వాతావరణం కనిపించింది. కానీ పోలీ సులు లోపలికి రావడంతో ఆ ఉత్సాహం ఒక్కసారిగా ఆగిపోయింది. 

కొంతమంది షాక్‌లో ఫ్రీజ్ అయిపోతే, మరికొందరు ఏమి జరుగుతుందో అర్థం కాని పరిస్థితి లో నిలిచిపోయారు. పోలీసులు ముందుగా సెక్యూరిటీని కంట్రోల్‌లోకి తీసుకుని లోపల అన్ని సెక్షన్లను చెక్ చేశారు. అక్కడ డాన్స్ ఫ్లోర్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కస్టమర్లను ఆకర్షిస్తున్నట్లు గుర్తించారు. మేనేజ్మెంట్ పబ్బులో డాన్స్ ఫ్లోర్ ఏర్పాటు చేసి కస్టమర్లను ఆకర్షిస్తున్నారు ..కస్టమర్లను ఆకర్షించేందుకు అమ్మాయిలను ఏర్పాటు చేశారు..అమ్మాయిలతో చాటింగ్ చేయించి యువకులను పబ్బుకు రప్పిస్తున్నారు. ఇలా కొన్ని ప్రమోషనల్ పద్ధతుల్లో అనుమానాస్పదంగా యువతులను వినియోగిస్తున్నారన్న పలు ఆరోపణలు వచ్చాయి.. 

అమ్మాయిలను అర్థనగ్నంగా డ్యాన్స్ చేయిస్తున్నట్లుగా పలు ఆరోపణలు కూడా రావడంతో డీసీపీ స్వయంగా సాధారణ మహిళగా రంగం లోకి దిగి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పబ్‌లో ఉన్న ప్రతి వ్యక్తిని ఒక్కొక్కరుగా తనిఖీ చేసి వివరాలు నమోదు చేశారు. ఈ క్రమంలో కొంతమంది యువతులు, కస్టమర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. 

రాత్రి లేట్ అవర్స్ వరకు కొనసాగు తున్న మ్యూజిక్ పార్టీలు, నియమాలు అతిక్రమించి నడుస్తున్నాయా అన్న కోణంలో కూడా విచారణ జరిగింది. అంతలో పబ్ మేనేజర్‌పై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి, నిర్వహణలో ఉన్న లోపాలు మరియు నిబంధ నల ఉల్లంఘనలు జరిగాయని గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.. మొత్తం వాతావరణం ఒక్కసారిగా పార్టీ మూడ్ నుంచి పోలీస్ ఇన్వెస్టి గేషన్ సీన్‌గా మారిపోయింది. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో పబ్‌లపై మరింత కఠిన తనిఖీలు జరగొచ్చని పోలీసులు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...