హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

posted on: Jun 3, 2026 9:21PM

 

మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

బుధవారం హరీష్ రావు నివాసానికి వెళ్లిన కేటీఆర్.. ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు పరిపూర్ణ ఆరోగ్యంతో, సుదీర్ఘ కాలం ప్రజాసేవలో కొనసాగాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ భేటీలో దేశీపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మరియు పలువురు పార్టీ ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...