ముగిసిన కేటీఆర్ సిట్ విచారణ
posted on: Jan 23, 2026 6:04PM
.webp)
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసింట్ కేటీఆర్ విచారణ ముగిసింది. 7 గంటలకు పైగా అధికారులు ఆయనను ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేశారా? ఎవరు చేయించారు. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు.? అనే వివరాలు అడిగినట్లు తెలుస్తోంది. కాగా మాజీ మంత్రి హారీశ్ రావును కూడా సిట్ ఇలాగే 7 గంటలు విచారించింది. ఉదయం 11 గంటల సమయంలో కేటీఆర్ విచారణ మొదలైంది. ఈ సందర్భంగా అధికారులు మాజీ మంత్రి నుంచి కీలక స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసినట్లు సమాచారం.
విచారణలో భాగంగా టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కూడా కేటీఆర్‌తో కలిసి గంటపాటు సిట్ ప్రశ్నించింది. గతంలో కేటీఆర్, రాధాకిషన్ రావుకు షేర్ చేసిన కొన్ని మొబైల్ నంబర్లపై ప్రత్యేకంగా విచా రణ జరిపినట్లు సమా చారం. ఆ నంబర్లకు సంబం ధించిన కాల్ డేటా, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై లోతైన ప్రశ్నలు వేసినట్లు తెలు స్తోంది. గతంలో జరిగిన ఉప ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు, కొంతమంది వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఆ సమయం లో ఎవరి ఆదేశాలతో ట్యాపింగ్ జరిగిందన్న అంశంపై కేటీఆర్ వివరణ కోరినట్లు అధికారులు వెల్లడించారు.
అయితే ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఎవరు వినియోగించారన్న దాని పైనా విచారణ కొనసాగింది.ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారులు, సిబ్బందిని సిట్ అధికారులు విచారణ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కేటీఆర్ విచారణతో ఈ వ్యవహారం మరింత కీలక దశకు చేరిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విచారణ సమయంలో కేటీఆర్ సిట్ అధికారులకు సహకరించినట్లు తెలిసింది.విచారణ ముగిసిన అనంతరం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి కేటీఆర్ నేరుగా తెలంగాణ భవన్‌కు బయలుదేరారు.


.webp)
.webp)


